ఫ్లోరైడ్‌పై వెంకటరెడ్డి ఆసక్తికర ట్వీట్‌  | MP Komatireddy Venkat Reddy Interesting Tweet On CM KCR | Sakshi
Sakshi News home page

ఫ్లోరైడ్‌పై వెంకటరెడ్డి ఆసక్తికర ట్వీట్‌ 

Published Mon, Aug 22 2022 4:33 AM | Last Updated on Mon, Aug 22 2022 4:33 AM

MP Komatireddy Venkat Reddy Interesting Tweet On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ నల్లగొండ ఫ్లోరైడ్‌పై చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘నల్లగొండ ఫ్లోరైడ్‌ను అంతం చేసింది టీఆర్‌ఎస్‌ అయితే’.. అంటూ ట్విట్టర్‌ వేదికగా ఆదివారం ఆయన పలు ప్రశ్నలు సంధించారు. ‘2003లో 12 రోజులు ఆమరణ దీక్ష చేసిందెవరు?

కేసీఆర్‌ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు ఫ్లోరైడ్‌ నీటి బాటిల్స్‌ అసెంబ్లీకి తెచ్చిందెవరు? గవర్నర్‌ ముందు ఫ్లోరైడ్‌ నీటితో అన్నం వండిందెవరు? రూ.600 కోట్లతో 500 గ్రామాలకు ఫ్లోరైడ్‌ రహిత నీరు అందించింది ఎవరు?’.. అని ప్రశ్నించారు. ‘చరిత్ర మార్చకు.. చరిత్ర మరువకు’.. అంటూ తాను ఆమరణ దీక్ష చేసినప్పటి ఫొటోలను కోమటిరెడ్డి ట్యాగ్‌ చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement