సాక్షి, విజయవాడ: చంద్రబాబు హయాంలో అక్రమ ఓటర్ల నమోదు జరిగినప్పుడు రామోజీరావు కళ్లు ఏమైపోయాయని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. తెలంగాణలో పదవి కోల్పోయిన ఓ వ్యక్తి ఏపీకి వచ్చి మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు దగ్గర కొందరు జీతానికి పనిచేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
బోగస్ ఓట్లను తొలగించాలి..
కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, అనిల్ కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ భేటీ అయ్యారు. ఇక, సమావేశం అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. డూప్లికేట్ ఓటర్లు లేకుండా, బోగస్, ఇన్‌వాలీడ్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరాం. ఒక మనిషికి ఒక ఓటే ఉండాలని కోరాం. గత 15 రోజులుగా రామోజీరావు, రాధాకృష్ణ, టీడీపీ కలిసి ఓటర్ల జాబితాలో అక్రమాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ ఏదో చేస్తోందంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారా?. 59 లక్షల ఓట్లు 2019కి ముందు డబుల్ ఉన్నాయని ఫిర్యాదు చేశాం.
అప్పుడు రామోజీ కళ్లు ఏమయ్యాయి?..
వేర్వేరు నియోజకవర్గాలు, వేర్వేరు రాష్ట్రల్లో ఒకే వ్యక్తికి అధిక ఓట్లు ఉన్నాయి. అందుకే ఓటరు కార్డుకి ఆధార్‌ని అనుసంధానం చేయాలని కోరాం. ఒకే మనిషికి 2,3 ఓట్లు ఉన్నాయి.. వాటిని సరి చేయాలన్నాము. ఒకే ఇంట్లో 50 నుండి 1000 వరకు ఓట్లు ఉన్నవాటిని సరి చేయమని కోరాం. ఇవన్నీ అక్రమాలు 2019 ఓటర్ల జాబితాలోనే ఉన్నాయి. అప్పుడు కూడా ఫిర్యాదు చేశాం. కానీ, సరిచేయలేదు. విజయవాడ సెంట్రల్‌లో ఒకే ఇంట్లో 510 ఓట్లు టీడీపీ ప్రభుత్వం హయాంలో నమోదు చేశారు. చంద్రబాబు పత్రికలు కథనాలు రాసిన అన్ని ఓటర్లు పాత ప్రభుత్వంలో నమోదైనవే. చంద్రబాబు హయాంలో అక్రమ ఓటర్ల నమోదు జరిగినప్పుడు రామోజీరావు కళ్లు ఏమైపోయాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రామోజీరావు దృత రాష్ట్రుడు అయిపోయాడా?.
బండి సంజయ్‌కు కౌంటర్..
తెలంగాణ నుండి పదవి పోయిన బండి సంజయ్ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు. యూపీలో బీజేపీ చేసినట్టు మేము చేస్తున్నాం అని ఆ బీజేపీ నేత అనుకుంటున్నాడు. చంద్రబాబు దగ్గర జీతానికి కొందరు పనిచేస్తున్నారు. మేము దొంగ ఓట్ల ను చేరిస్తే ఓటర్ల సంఖ్య ఎందుకు పెరగలేదు అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment