పవన్‌కు పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌ | Perni Nani Political Strong Counter To Pawan Kalyan And Chandrababu Naidu, See Details Inside - Sakshi
Sakshi News home page

పవన్‌కు పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published Sat, Nov 25 2023 4:07 PM | Last Updated on Sat, Nov 25 2023 5:01 PM

Perni Nani Political Strong Counter To Pawan And Chandrababu - Sakshi

సాక్షి, కృష్ణా: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు. చంద్రబాబుతో కలిసి తప్పుడు ప్రభుత్వాన్ని నడిపిన నువ్వా నీతులు చెప్పేది అంటూ మండిపడ్డారు. ఐదేళ్లలో తన అవసరాల కోసం చంద్రబాబు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో నీ కళ్లకు కనిపించలేదా పవన్ అంటూ ప్రశ్నించారు. 

కాగా, పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ మత్య్సకారులకు పంచిన డబ్బుకంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువ. పవన్‌ తన దగ్గర డబ్బులు లేవని చెబుతాడు కానీ ఆయన వద్ద చాలా డబ్బులున్నాయి. పవన్‌ దగ్గర డబ్బులు లేకుంటే చార్టెడ్‌ ఫ్లైట్‌లో ఎలా వస్తాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మడం పవన్‌కు అలవాటుగా మారింది. ఏపీ ప్రజలకు మతిమరుపు చాలా ఎక్కువ అని పవన్‌ అనుకుంటున్నాడు. మత్స్యకారులకు సీఎం జగన్‌ ఏమీ చేయడం లేదని పవన్‌ అంటున్నాడు. సీఎం జగన్‌ వచ్చాకే 10 ఫిషింగ్‌ హార్బర్లు మంజూరయ్యాయి. శరవేగంగా పనులు జరుగుతున్నాయి.

పవన్‌ నిద్రలేచే సరికే ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు సీఎం జగన్‌ అండగా నిలిచారు. పవన్‌ మాటలన్నీ పచ్చి దగాకోరు మాటలు. పవన్‌ డబ్బులిచ్చి వెళ్లే సరికే సీఎం జగన్‌ ప్రభుత్వం రూ.7కోట్ల 11లక్షల పరిహారం ఇచ్చింది. పవన్‌కు కావాలంటే ఎవరెవరికి డబ్బులు ముట్టాయో పేర్లతో సహా లిస్ట్‌ ఇస్తాం. ఊపుకుంటూ వచ్చి రూ.50వేలు ఇచ్చి రూ.50కోట్లు ఇచ్చినట్టు బిల్డప్‌ ఇస్తున్నాడు. పవన్‌ కల్యాణ్‌కు ఛాలెంజ్‌ చేస్తున్నా. 2014 నుంచి 2019 వరకు నువ్వు, చంద్రబాబు కలిసి ఒక్క ఫిషింగ్‌ హార్బర్‌ అయినా కట్టారా సమాధానం చెప్పాలి.

ప్రజలను ఓటుగా చూసే వ్యక్తులు చంద్రబాబు, పవన్‌. కాపులను పవన్‌ ఏనాడైనా మనుషుల్లాగా చూశాడా?. కాపులను పెట్టుబడిగా, ఆస్తిగా, టోకుగా చంద్రబాబుకు బేరం పెట్టడానికే పవన్‌ చూస్తున్నాడు. ఓట్ల కోసం మాయ చేసి మోసం చేయడానికే చంద్రబాబు, పవన్‌ వస్తున్నారు. విమానం రానివ్వపోవడానికి మాకేం పని. విమానం దొరకలేదని ఏడవచ్చు కదా.. సిగ్గులేని మాటలు దేనికి. ఇంటెలిజెన్స్‌ ఆపితే విమానంలో ఎలా వచ్చావ్‌.. ఎలా వెళ్లావ్‌ పవన్‌?. నువ్వు శాస పీల్చేది.. వదిలేది చంద్రబాబు కోసమే. చంద్రబాబును అధికారంలో చూడాలనే ఆకాంక్షతోనే పవన్‌ పనిచేస్తున్నాడు. ఇందులో భాగంగానే పవన్‌ పిట్టలదొర కబుర్లు చెబుతున్నాడు. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో కూడా పవన్‌కు తెలియదు’ అంటూ సెటైర్లు వేశారు. 

ఇదే సమయంలో పేర్ని నాని.. చంద్రబాబు ఇంటి అవసరాల పేరుతో ఖర్చు చేసిన వివరాల చిట్టాను విప్పారు. ఈ సందర్బంగా పేర్ని నాని.. పవన్ నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా.. అని కొన్ని ప్రశ్నలు సంధించారు. 

ప్రశ్నలు ఇవే..
►చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే హైదరాబాద్ సచివాలయంలోని హెచ్ బ్లాక్‌కు ఏడు కోట్లు.
►వాస్తుబాగోలేదని ఎల్ బ్లాక్‌కు రూ.15 కోట్లు 
​​​​​​​►లేక్ వ్యూలో క్యాంప్ ఆఫీస్ పెడతానని రూ.10 కోట్లు 
​​​​​​​►చంద్రబాబు ఆఫీసులో కుర్చీలకు రూ.10 కోట్లు  
​​​​​​​►మదీనాగూడలోని చంద్రబాబు ఫామ్ హౌస్‌కు రూ. 5 కోట్లు 
​​​​​​​►రోడ్ నెంబర్ 65లో చంద్రబాబు సొంతింటికి రూ.60 కోట్లు 
​​​​​​​►రోడ్డు నెంబర్ 42కి ఇల్లు మారి అద్దె ఇల్లుకు రూ.50 కోట్లు ఖర్చు చేశాడు
​​​​​​​►ఓటుకు నోటు కేసులో దొరికిపోయి చంద్రబాబు అర్ధరాత్రి బెజవాడ పారిపోయి వచ్చాడు  
​​​​​​​►స్పెషల్ ఏసీ బస్సు కోసం రూ.6 కోట్లు  
​​​​​​​►ఇరిగేషన్ ఆఫీస్‌ను క్యాంప్ ఆఫీస్‌గా మార్చడానికి మరో రూ.75 కోట్లు
​​​​​​​►లంచానికి తీసుకున్న లింగమనేని రమేష్ ఇల్లు మార్చడానికి రూ.150 కోట్లు 
​​​​​​​►ఆ ఇంటి చుట్టూ రోడ్లు, షెడ్లు కట్టడానికి రూ.200 కోట్లు 
​​​​​​​►నదివైపు ఇంటి కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బిగించేందుకు ఏడున్నర కోట్లు 
​​​​​​​►లింగమనేని రమేష్ వద్ద లంచానికి తీసుకున్న ఇంటిలో మొక్కలు నాటడానికి పదికోట్లు.  

ఐదేళ్లలో తన అవసరాల కోసం చంద్రబాబు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడో నీ కళ్లకు కనిపించలేదా పవన్ అంటూ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. చంద్రబాబుతో కలిసి తప్పుడు ప్రభుత్వాన్ని నడిపిన నువ్వా నీతులు చెప్పేది అని ఫైరయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement