సాక్షి, విజయవాడ: షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. "బ్రదర్ అనిల్‌పై గతంలో టీడీపీ నేతలు ఎలాంటి విమర్శలు చేశారో చూశాం.. ఇప్పుడు అదే బ్రదర్ అనిల్ పక్కన టీడీపీ నేతలు ఫొటోలు దిగుతున్నవి కూడా చూశాం.. దీన్ని బట్టి టిడిపి నేతల పన్నాగాన్ని అర్థం చేసుకోవచ్చాన్నారు" సజ్జల రామకృష్ణారెడ్డి.
‘‘వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిన తొలిరోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందుల నుంచి విజయమ్మకు పోటీగా బరిలోకి దింపింది. వైఎస్సార్ మరణంలోనూ కాంగ్రెస్ పార్టీపై అనుమానాలున్నాయి. కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరవెనుక రాజకీయం కొనసాగుతూనే ఉంది. ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదని చంద్రబాబుకు అర్థం అయింది. అందుకే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను డైవర్ట్ చేయడానికే బాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు.
సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన అంశాలు ఏంటంటే..:
- షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది
- షర్మిల రాజకీయంగా ఎక్కడనుంచైనా ప్రాతినిధ్యం వహించొచ్చు
- షర్మిల వల్ల YSRCPకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే నష్టం ఏమీ ఉండదు
- షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు ఉన్నారు
- సీఎం రమేష్‌కు సంబంధించిన సొంత విమానంలో షర్మిల, బ్రదర్ అనిల్ వెళ్లారు
- ఎయిర్‌పోర్టులో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు
(ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు కింద చూడవచ్చు) - టీడీపీ నేత బీటెక్ రవిని... బ్రదర్ అనిల్ కలవడం ఇవన్నీ అందులో బాగమే
- అంతకు ముందు బెంగళూరులో కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చంద్రబాబు చర్చలు జరిపారు
- వైఎస్ఆర్ మరణంపై కాంగ్రెస్‌కు సంబంధించి ఆ రోజు నుంచే అనుమానాలున్నాయి
- టీడీపీ, కాంగ్రెస్ కలిసే నాడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు మోపాయి
- కాంగ్రెస్ నేతగా, ముఖ్యమంత్రిగా ఉంటూ వైఎస్సార్ చనిపోయారు
- ఆయన చనిపోయాక.. పులివెందుల నుంచి విజయమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేశారు
- విజయమ్మకు పోటీగా పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డిని కాంగ్రెస్ బరిలో దించింది
- YSRCP అభ్యర్థిగా విజయమ్మకు 70శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకాకు 20శాతం ఓట్లు కూడా రాలేదు
- కాంగ్రెస్ తో ఎప్పుటి నుంచో చంద్రబాబు కాంటాక్ట్ లో ఉంటున్నాడు
- చంద్రబాబు తనకేం కావాలో ఓ కుట్ర ప్రకారం మిగతా వాళ్లను కలుపుకుని అందరితో కలిసి చేయిస్తాడు
- సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబుకు మైనస్ మార్కులు వస్తాయి
- అందుకే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు
- కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
- ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదు
- కాంగ్రెస్ పార్టీని మేము పట్టించుకోం, పట్టించుకునే పరిస్థితులు కూడా లేవు
- ప్రజలా? కుటుంబమా? అనే ప్రశ్న వస్తే ముఖ్యమంత్రి YS జగన్ ఛాయిస్ ప్రజలే
- రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్లీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు?
- కుటుంబం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి YSRCPని పెట్టలేదు
- ఒక పార్టీగా మా విధానాలు మాకు ఉన్నాయి
(ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన షర్మిల, ఎడమ సోనియాతో, కుడి ఖర్గేతో షర్మిల)
(ఇటీవల తెలుగుదేశం నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ భేటీ)
(ఇటీవల తెలుగుదేశం నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్ భేటీ)
(బెంగళూరులో డీకే శివకుమార్‌తో చంద్రబాబు మంతనాలు)
ఇదీ చదవండి: నారా దారి.. అడ్డదారి: పరాకాష్టకు కుట్రలు, కుతంత్రాలు
Comments
Please login to add a commentAdd a comment