సాక్షి, ఢిల్లీ: బీజేపీతో పొత్తు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తహతహలాడుతున్నాడు. ఏం చేసైనా, ఎలాగైనా బీజేపీతో పొత్తు కోసం నానా తంటాలు పడుతున్నాడు. ఢిల్లీలో గల్లీలు తిరుగుతూ ప్లీజ్ ఒక్కసారైనా కలవండి సార్ అంటూ బీజేపీ పెద్దల ప్రసన్నం కోసం పడిగాపులు కాస్తున్నాడు.
అయితే, బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నాడు. ఎన్నికల్లో తమకు ఎన్ని సీట్లు ఇచ్చినా ఒకే అని ఫిక్స్ అయ్యాడు. ముందు పొత్తు మాత్రం కావాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగానే నిన్న(బుధవారం) సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాంట్‌మెంట్ కోసం వేచిచూశాడు. చివరికి అర్ధరాత్రి అమిత్ షా, జేపీ నడ్డా.. చంద్రబాబును పిలిపించారు. కాసేపు చంద్రబాబుతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇక, వీరి భేటీ సందర్బంగా జేపీ నడ్డా పది నిమిషాలు ముందుగానే వెళ్లిపోయినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. బీజేపీ పెద్దల భేటీ అనంతరం చంద్రబాబు సైతం గప్‌చుప్‌గానే ఉన్నారు. దీంతో, టీడీపీతో పొత్తుకు వారు ససేమిరా అన్నారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు.. జనసేన పవన్‌తో రాయబారం నడుపుతున్నాడు. ఎలాగైనా పొత్తు ఖరారు చేసేలా పవన్‌తో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఇక, తాము ఇచ్చిన సీట్లనే తీసుకోవాలని బీజేపీ నేతలు బాబుకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో, ఎన్ని సీట్లకైనా తాము రెడీగా ఉన్నామని బాబు ఫిక్స్ అయినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment