
పూర్ణకు చెక్ అందజేస్తున్న అర్వింద్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా హడావుడి చేసి, ఆర్భాటంగా ప్రచారం చేసిన జాతీయపార్టీ ‘బీఆర్‌ఎస్’ ఏమైందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఇటీవల వివిధ రాష్ట్రాలు తిరిగొచ్చి అనేక మంది నిపుణులు, రాజకీయ ప్రముఖులను కలసిన దేశ్‌కీ నేత కేసీఆర్ దీనిపై స్పష్టతనివ్వాలన్నారు. టీఆర్‌ఎస్ పోతేనే బీఆర్‌ఎస్ వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం పార్టీనేతలు రవీంద్రనాయక్, జె.సంగప్పలతో కలసి అర్వింద్ విలేకరులతో మాట్లాడుతూ పర్వతారోహణలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన మలావత్ పూర్ణను ‘తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పూర్ణను ప్రోత్సహించడానికి తమ ఫౌండేషన్ తరఫున రూ.3.51 లక్షలు అందజేస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన పూర్ణకు చెక్కు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment