
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు. సెలబ్రిటీలు సైతం రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా పార్టీ స్థాపించారు. తాగాజా ఊర్వశి రౌతేలా రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఎన్నికల సమయంలో పలు పార్టీలు సినీతారలకు టికెట్స్ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇన్‌స్టంట్ బాలీవుడ్‌తో మాట్లాడిన రౌతేలా, "నాకు ఇప్పటికే టిక్కెట్ వచ్చింది. ఇప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకోవాలి" అని అన్నారు. అయితే నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయాన్ని అభిమానుల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయాలని వెల్లడించింది.
ఊర్వశి రౌతేలాకు ఎలక్షన్ టికెట్ ఇచ్చారని వెల్లడించింది. కానీ.. ఏ పార్టీ టికెట్ ఇచ్చింది. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంది, అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు రాజకీయాల్లోకి రావాలని కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఇది కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే అని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment