ఫీజు పోరును విజయవంతం చేయండి
● పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
చీమకుర్తి: వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5వ తేదీ ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా నిర్వహించనున్న ఫీజు పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం చీమకుర్తిలోని బూచేపల్లి నివాసం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఫీజు పోరు కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలను నిలిపివేశారన్నారు. వాటిని ఇవ్వలేనని బహిరంగంగా సీఎం చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఫీజులివ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నందుకు నిరసనగా అన్ని వర్గాల ప్రజలతో పాటు విద్యార్థి విభాగాలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు, విద్యార్థులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చీమకుర్తి పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, సంతనూతలపాడు మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, నాయకులు దుంపా యలమందారెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్‌రెడ్డి, సూడిదేల విజయభాస్కర్‌రెడ్డి, కూడలి మాలకొండయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment