ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం

Published Tue, May 7 2024 7:00 PM

ఎన్ని

భారీగా పట్టుబడుతున్న నగదు,

బంగారం, మద్యం, గంజాయి

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు తనిఖీలు ము మ్మరం చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,332 కేసుల్లో రూ.9,39,42,041 కోట్ల నగదు సహా మొత్తం రూ.41,81,11,904 విలువ చేసే బంగారు ఆభరణాలు, మద్యం సీసాలు, డ్రగ్స్‌ సీజ్‌ చేశారు. వీటిలో రూ.24, 88,40,388 విలువ చేసే 4,44,639. 8652 గ్రాముల బంగారం, రూ.30,34,700 విలువ చేసే 48,900 గ్రాముల వెండి, రూ.1,50, 00,738 విలువ చేసే 48,810 లీటర్ల మద్యం పట్టుబడింది. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

మోడల్‌ జూనియర్‌

కళాశాలలో అడ్మిషన్లు షురూ

చేవెళ్ల: తెలంగాణ ప్రభుత్వ మోడల్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ అడ్మిషన్లు ప్రారంభమైనట్ల్లు కళాశాల ప్రిన్సిపాల్‌ టేనావతి పేర్కొన్నారు. చేవెళ్లలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల విడుదలపై పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్‌ మోడల్‌ కళాశాలలో చేరాలనుకుంటే దరఖాస్తు చేసుకోవా లన్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు ఉన్నాయని తెలిపారు. పదో తరగతిలో 9జీపీఏ పైగా సాధించిన అమ్మాయిలకు హాస్టల్‌వసతి కూడా ఉందని చెప్పారు. మార్కుల మెమో, ఆధార్‌కార్డు, క్యాస్ట్‌, ఇన్‌కమ్‌ సర్టిఫికెట్ల జిరాక్స్‌లతోపాటు రెండు పాస్‌పోర్టు ఫొటోలతో కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ఆమె సూచించారు.

స్ట్రాంగ్‌రూంను పరిశీలించిన మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌

షాద్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో షాద్‌నగర్‌ పట్టణంలోని మినీ స్టేడియంలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంను సోమవారం మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రవి నాయక్‌ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ రిసెప్షన్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లపై ఆర్‌డీఓ వెంకట మాధవరావును అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ పార్థసారధి, పట్టణ సీఐ ప్రతాప్‌లింగం ఉన్నారు.

‘పట్నం’లో స్ట్రాంగ్‌ రూం పరిశీలన

ఇబ్రహీంపట్నం: భువనగరి లోక్‌సభ పరిధి లోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం స్ట్రాంగ్‌రూంను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ జెండగే హనుమంత్‌ కొండబా సందర్శించారు. ఖానాపూర్‌ సమీపంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్‌ రూంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హనుమంత్‌ అక్కడి పరిస్థితులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అయన వెంట ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల అధికారి అనంతరెడ్డి ఉన్నారు.

మోదీ రాక.. నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు

సనత్‌నగర్‌: ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా మంగళ, బుధవారాల్లో పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 7న (మంగళవారం) రాత్రి 7.50 నుంచి 8.25 మధ్య ప్రధాని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వై జంక్షన్‌, పీ అండ్‌ టీ ఫ్లైఓవర్‌ వద్ద యూ టర్న్‌, షాపర్స్‌స్టాప్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట ఫ్లైఓవర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌, రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద లెఫ్ట్‌ టర్న్‌, మోనప్ప ఐల్యాండ్‌ జంక్షన్‌, యశోద హాస్పి టల్‌, ఎంఎంటీఎస్‌ మీదుగా రాజ్‌భవన్‌ చేరుకుంటారు. ఈ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఈ నెల 8న (బుధవారం) ఉదయం 8.35 నుంచి 9.10 గంటల మధ్య అదే మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు.

ఎన్నికల వేళ  తనిఖీలు ముమ్మరం
1/1

ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం

 
Advertisement
 
Advertisement