పంజగుట్ట: కంప్యూటర్లు వచ్చినా, ఈ బుక్స్, ఆన్‌లైన్ పరిధి ఎంత పెరిగినా పుస్తకం పేజీల వాసన చూసుకుంటూ చదివే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉందని ఎమ్మెల్సీ, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ సొసైటీ సలహాదారు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పోస్టర్‌ను ఫెయిర్ సలహాదారు రామచంద్రమూర్తి, ఆచార్య రమా మెల్కోటె, ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్‌టీఆర్ స్టేడియం గ్రౌండ్స్, కళాభారతిలో బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 12 నుంచి రాత్రి 9 గంటలవరకు కొనసాగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment