ఎయిర్‌పోర్టులో హర్షసాయి ప్రత్యక్షం
శంషాబాద్ రూరల్: కొంతకాలంగా విదేశాల్లో ఉన్న యూట్యూబర్ హర్షసాయి సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యాడు. ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. ఒక చిన్న పని ఉండటంతో విదేశానికి వెళ్లి పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చినట్లు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజం కావని కోర్టు నమ్మి బెయిల్ ఇచ్చిందన్నారు. తాను రాసి తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్ అడిగారని పేర్కొన్నారు. తాను ఎక్కడ ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు. ప్రజల్లో తనను చులకన చేయడానికి కొందరు అసత్య ప్రచారాలు చేసినటు ్లతెలిపారు. పోలీసుల విచారణలో నిజానిజాలు బయటకు రావడంతో కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. త్వరలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
పోల్‌ను ఢీకొట్టిపల్టీ కొట్టిన కారు
రాజేంద్రనగర్: వేగంగా దూసుకొచ్చిన ఓ కారు పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్ ఉప్పర్‌పల్లి సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ సంఘటన సోమవారం పీవీ నర్సింహారావు ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. దీంతో ఈ సంఘటనతో ప్లైఓవర్ రెండు వైపుల పెద్ద ఎత్తున ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సంఘటనలో హైదరాబాద్ నుంచి ఆరాంఘర్ వైపు వస్తుండగా వాహనాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొట్టడంతో డ్రైవర్ స్వల్ప గాయాలకు గురయ్యాడు. దీంతో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.
నాలెడ్జీ సిటీలో బైక్ రేస్
53 బైక్‌లు స్వాధీనం
గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లోని నాలెడ్జీ సిటీలోని టీ–హబ్ సమీపంలో బైక్ రేస్‌ల పరంపర కొనసాగుతోంది. కేసులు నమోదు చేస్తున్నా పట్టించుకోకుండా యువకులు బైక్‌పై ప్రమాదకర స్థాయిలో స్టంట్‌లు చేయడం ఆందోళన కల్గిస్తోంది. శనివారం రాత్రి బైక్‌పై స్టంట్‌లు చేస్తున్నట్లు సమాచారం అందడంతో రాయదుర్గం పోలీసులు టీ–హబ్ పరిసరాలను దిగ్భందం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 53 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 125 ప్రకారం కేసులు నమోదు చేశారు. గత మూడు రోజులుగా 89 బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను కోర్టులో హజరుపరిచారు. ఇప్పటి వరకు 203 బైక్‌లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment