సేవలతోనే సమాజంలో గుర్తింపు
కడ్తాల్: సేవలతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ 4వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు సబితారెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్‌పర్సన్ రజిని సాయిచంద్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సబితారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్న పేదల కోసం రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, పలువురు నాయకులు మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఆపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవడం అభినందనీయమని ట్రస్ట్ చైర్మన్ దశరథ్ నాయక్‌ను ప్రశంసించారు. ట్రస్ట్ చైర్మన్ దశరథ్‌నాయక్ మాట్లాడుతూ.. ట్రస్ట్ ద్వారా నాలుగేళ్లుగా పేద ప్రజలకు సేవలందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది నుంచి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల పెళ్లిళ్లకు తులం బంగారం, రూ.1,10,116 నగదు అందించనున్నట్టు ప్రకటించారు. అనంతరం ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన 60 మంది బాధిత కుటుంబాలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, పట్టణ అధ్యక్షుడు కడారి రామకృష్ణ, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, సర్పంచ్‌ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment