ముకునూర్‌లో ఎన్‌ఆర్‌ఎల్‌ఎం బృందం
ఇబ్రహీంపట్నం: నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) బృందం సభ్యులు మండల పరిధిలోని ముకునూర్ గ్రామాన్ని సందర్శించి వివిధ పనులను పరిశీలించారు. ఆ బృందం సభ్యులు భక్తవత్సల పెరుమాలన్, సుందర ప్యాండన్ ముకునూర్ గ్రామ పల్లె ప్రకృతి వనాన్ని, గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని, కంపోస్టు యార్డు నిర్వహణ, పాంపడ్ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ రిజిస్టర్స్ మెయింటనెన్స్ పరిశీలించి గ్రామ కార్యదర్శి రాజ్‌కుమార్‌ను అభినందించారు. ఆసరా ఫించన్లు వస్తున్నా యా? ఎంత వస్తుందని పలువురు ఫించన్‌దారు లను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. సీ్త్రనిధి రుణం తీసుకొని కిరాణ షాపును పెట్టుకు ని జీవనోపాధి పొందుతున్న మహిళతో వారు మాట్లాడారు. ఎంత అదాయం వస్తుంది? తీసుకున్న రుణం చెల్లించే విధానం అడిగారు. నిత్యం రూ.2వేల వ్యాపారం సాగుతుందని, వాయిదాల పద్ధతిలో రుణాన్ని చెల్లిస్తుననట్లు ఆమె చెప్పారు. ఎంపీడీఓ వెంకటమ్మ, ఎంపీఓ లక్పతినాయక్, ఏపీఓ తిరుపతిచారి, ఏపీఎం రవీందర్, పంచాయతీ కార్యదర్శి రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శిని అభినందించిన సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment