హడలెత్తించిన కలెక్టర్
శంకర్‌పల్లి: మున్సిపాలిటీలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి శంకర్‌పల్లి పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. తహసీల్దార్, ఆదర్శ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు, రిజిస్ట్రేషన్ తదితర విషయాలను తహసీల్దార్ సురేందర్‌ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న ఆదర్శ పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా లేకపోవడం, తాగునీటి సరఫరా, బయట వ్యక్తులు లోపలికి వచ్చే అవకాశం ఉండడం తదితర విషయాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ విద్యాబోధనను మరింత మెరుగు పరుచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల గ్రంథాలయంలో సరైన పుస్తకాలు, మౌలిక సదుపాయాలు లేవని గుర్తించిన ఆయన వద్ద ఉన్న స్పెషల్ గ్రాంట్ నిధుల నుంచి గ్రంథాలయానికి రూ.లక్ష, పాఠశాల అభివృద్ధికి రూ.5లక్షలను మంజూరు చేశారు. పాఠశాలని సీఎస్‌ఆర్ ఫండ్ కింద మరింత అభివృద్ధి చేసుకోవాలని ఎంఈఓ అక్బర్‌కి సూచించారు.
శంకర్‌పల్లి పీహెచ్‌సీ, ఆదర్శ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
వైద్యురాలితో పాటుగా ఇద్దరుసిబ్బందికి మెమోలు, ఒకరి సస్పెండ్
నెలరోజుల్లో తీరుమారాలని కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరిక
సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్
శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శ పాఠశాలతో పాటు ఆస్పత్రి ఆవరణను వెంటనే డోజర్లతో శుభ్రం చేయించాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి హాజరు రిజిస్టర్‌ను పరిశీలిస్తూ ఒక్కొక్కరి వివరాలు తెలుసుకున్నారు. సమాచారం లేకుండా సెలవు తీసుకున్న సీనియర్ అసిస్టెంట్ టోనీపై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్ విధులు సక్రమంగా నిర్వహించని కారణంగా ఎంసీహెచ్ సూపర్‌వైజర్ యాగ్నస్, సిబ్బంది శ్రీనివాస్‌తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ రేవతిరెడ్డికి మోమోలు జారీ చేయాలని అఽధికారులను ఆదేశించారు. నెల రోజుల తర్వాత శంకర్‌పల్లికి వస్తానని, ఆదర్శ పాఠశాల, ఆసుపత్రి ఆవరణ తీరు మారిపోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment