
వహ్‌వా.. వాకా లక్ష్మీశైలజ
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025
‘మద్ది’ సిస్టర్స్.. అదుర్స్
మీర్‌పేట: తల్లి వృద్ధాప్యం.. సోదరుడు అనారోగ్యంతో జీవితకాలం మంచానికే పరిమితం.. అన్నీ తానై అటు ఇంటి బాధ్యతను చూస్తూ.. ఇటు ఉద్యోగం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది వాకా లక్ష్మీశైలజ. మీర్‌పేట జిల్లెలగూడకు చెందిన వాకా లక్ష్మీశైలజ సౌత్‌సెంట్రల్ రైల్వే విభాగం సికింద్రాబాద్ డివిజన్ లాలాగూడలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తోంది. సాధారణంగా ఈ విభాగంలో పురుషులే ఎక్కువగా పనిచేస్తుంటారు. శైలజ గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసినప్పటికీ మానేసి రైల్వేలో ఉద్యోగం సాధించింది. విధి నిర్వహణలో కఠినమైన మెకానికల్ పనుల్లో భాగంగా మగవారికి దీటుగా రైల్వే వీల్స్‌కు సంబంధించిన పనులు చేస్తోంది. ఉద్యోగంతో పాటు కుటుంబ పోషణ భారమంతా తనపైనే వేసుకుని తల్లి, సోదరుడి ఆలనా, పాలనా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఉద్యోగంతో పాటు రైల్వే అవగాహన కార్యక్రమాలు, సాంస్కృతిక, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటోంది. రైల్వే ఉన్నతాధికారుల నుంచి పలుమార్లు ప్రశంసా పత్రాలు అందుకుంది. ‘మహిళలు అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. అన్ని రంగాల్లో రాణించాలని’ అంటోంది.
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుపేద కుటుంబానికి చెందిన వారికి నలుగురు కూతుళ్లు.. అంతా ఆడ పిల్లలే అని ఏనాడూ బాధపడలేదు. బాగా చదివిస్తే వారే కుటుంబానికి వెలుగవుతారని నిర్ణయించుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం తుర్కగూడ అనుబంధ గ్రామం ఎర్రగుంటకు చెందిన కత్తుల అండాలు దేవదాసు దంపతులకు శ్వేత, నిఖిత, మేఘన, దీక్షిత నలుగురు సంతానం. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చేర్పించారు. అనంతరం పెద్ద కూమార్తె శ్వేత తమిళనాడులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. రెండో కుమార్తె నిఖిత బీటెక్ చదివి, బెంగళూర్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. మూడో కూతురు మేఘన కరీంనగర్‌లోని మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చిన్న కుమార్తె దీక్షిత చిన్నప్పటి నుంచి ఆటల్లో మేటి. అథ్లెటిక్స్, ఖోఖోలో రాష్ట్ర స్థాయిలో అనేక పతకాలు సాధించింది. ప్రస్తుతం బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నలుగురూ ఇబ్బందులు, ఒడిదొడుకులు ఎదురైనా చదువును కొనసాగిస్తున్నా రు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత చదువులు చదువుతూ న లుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
న్యూస్‌రీల్

వహ్‌వా.. వాకా లక్ష్మీశైలజ

వహ్‌వా.. వాకా లక్ష్మీశైలజ

వహ్‌వా.. వాకా లక్ష్మీశైలజ

వహ్‌వా.. వాకా లక్ష్మీశైలజ

వహ్‌వా.. వాకా లక్ష్మీశైలజ

వహ్‌వా.. వాకా లక్ష్మీశైలజ
Comments
Please login to add a commentAdd a comment