అడ్డాపై కూలీ మృతి
తుర్కయంజాల్: కూలి పనికి వెళ్లిన వ్యక్తి లేబర్ అడ్డాపై మృతి చెందాడు. ఈఘటన తుర్కయంజాల్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మిర్యాలగూడకు చెందిన వెంకటయ్య(50) దంపతులు తుర్కయంజాల్‌లో నివాసం ఉంటూ రోజువారి కూలీపనుల కోసం అడ్డామీదకు వెళ్తారు. శనివారం ఉదయం కూలీకోసం దంపతులు అడ్డామీదకు వెళ్లారు. అక్కడ చేరుకున్న కాసేపటికే వెంకటయ్య ఒక్కసారిగా కుప్పకూలాడు. గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించుకున్నారు. మృతదేహాన్ని తరలించేందుకు డబ్బు లేకపోవడంతో దాతలు స్పందించి రూ.7వేలు పోగు చేసి ఆటో వారి స్వగ్రామానికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment