
సేకరిస్తున్నా పేరుకుపోతోంది
బడంగ్‌పేట్: మున్సిపల్ కార్పొరేషన్‌లో 32 డివిజన్లు ఉన్నాయి. నిత్యం 50 టన్నులకు పైగా చెత్తను సేకరిస్తున్నారు. సేకరించిన చెత్తను కార్పొరేషన్ పరిధిలోని కుర్మల్‌గూడలో నిర్మించిన డీఆర్‌సీకి, అక్కడి నుంచి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అయినా రాత్రివేళ రోడ్లకు ఇరువైపులా, ఓపెన్ ప్లాట్లలో, కాలనీల మలుపుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. దీంతో కుప్పలుగా పేరుకుపోతోంది. ఎప్పటికప్పుడు పడేసిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నామని శుభ్రం చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అవగాహన కల్పిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా మార్పు రావడం లేదని అంటున్నారు.
రంగులతో ముగ్గులు, జరిమానా
మలుపులు, కూడళ్ల వద్ద చెత్తను నిర్లక్ష్యంగా పడేస్తున్నారు. మహిళా సిబ్బందితో చెత్త వేయొద్దని రంగురంగుల ముగ్గులు వేయిస్తున్నాం. చెత్త వేస్తే జరిమానా సైతం విధిస్తున్నాం. ప్రజల్లోనూ మార్పు రావాలి. – వి.యాదగిరి, శానిటరీ ఇన్‌స్పెక్టర్