అసెంబ్లీలో ఎమ్మెల్యే కసిరెడ్డి
ఆమనగల్లు: రంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలను కలిపే కడ్తాల్ నుంచి కొట్ర ఎక్స్‌రోడ్డు వరకు ఉన్న రోడ్డులో.. అటవీ భూమిలో డబుల్‌రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం రెండు వరుసలుగా రహదారిని నిర్మించారని తెలిపారు. మాదారం దాటిన తరువాత అటవీశాఖ భూమిలో 1.5 కిలో మీటర్ల రోడ్డు ఉందని, ఆ శాఖ అనుమతి లేకపోవడంతో రోడ్డు నిర్మించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సింగిల్‌రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. సింగిల్ రోడ్డును డబుల్‌రోడ్డుగా నిర్మించాలని కోరారు. దీనిపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అంతకు ముందు కల్వకుర్తి ఆర్టీసీ డిపోనకు నూతనంగా 16 కొత్త బస్సులను కేటాయించడంపై ఎమ్మెల్యే కసిరెడ్డి మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామకం
● అర్బన్ అధ్యక్షుడిగా వి.శ్రీనివాస్‌రెడ్డి
● రాజ్‌భూపాల్‌గౌడ్‌కు రూరల్ జిల్లా బాధ్యతలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బీజేపీ రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షుడిగా శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్, జిల్లా అర్బన్ అధ్యక్షుడిగా వి.శ్రీ నివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ జిల్లా ఎన్నికల అధికారి కట్ట సుధాకర్‌రెడ్డి వీరికి నియామకపత్రం అందజేశారు. 1970లో జన్మించిన రాజ్‌భూపాల్‌గౌడ్ బాల్య స్వయం సేవక్‌గా పని చేశారు. 1995లో బీజేపీ పాలమాకుల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా, 1997లో యువమోర్చా మండల అధ్యక్షుడిగా, 2000లో యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, 2007లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 2015లో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. 2009లో రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. మూడు దశాబ్దాలుగా బీజేపీతో ఆయనకు అనుబంధం ఉంది. ప్రస్తు తం పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంపై ఆయన సన్నిహితులు, కార్యకర్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కాగా.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాలకు చెందిన శ్రీనివాస్‌రెడ్డికి డ్రాగన్ ఫ్రూట్ రైతుగా పేరుంది. ప్రస్తు తం ఆయన వనస్థలిపురంలో ఉంటున్నారు.
మార్కెట్ కమిటీ
చైర్‌పర్సన్‌గా గోవిందమ్మ
శంకర్‌పల్లి: మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా మండలంలోని మహాలింగాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్‌గా శంకర్‌పల్లి పట్టణానికి చెందిన చంద్రమోహన్‌తో పాటు మరో 16మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ సందర్భంగా గోవిందమ్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి, ఈ అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే యాదయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గం ప్రమాణస్వీకారం తేదీ ఖరారు కావాల్సి ఉంది.
సిటీ హీటెక్కుతోంది!
మరో మూడ్రోజులు భానుడి భగభగలు
సాక్షి, సిటీబ్యూరో: నగరం గరం అవుతోంది. ఉదయం 7 గంటలకే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం ఎండలు మండుతున్నాయి. గత రెండు రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలాఖరులోగా 45 డిగ్రీలకు చేరి వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఒంటి పూట బడులు ప్రారంభం కావడంతో మధ్యా హ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో విద్యా ర్థులు ఎండలకు తల్లడిల్లుపోతున్నారు. సోమ వారం గోల్కొండ, ముషీరాబాద్, చార్మినార్, బహదూర్‌పురా, బండ్లగూడ, అంబర్‌పేట, మారేడుపల్లి, హిమాయత్ నగర్, షేక్‌పేట్, ఖైరతాబా ద్, సైదాబాద్‌లలో గరిష్టంగా 39 డిగ్రీల ఉష్టోగ్ర తలు నమోదయ్యాయి.
డబుల్‌రోడ్డుకు అనుమతివ్వండి