మొయినాబాద్: శిఖం పట్టాలో ఉన్న చెరువు కట్టను తొలగించి నవారే పునరుద్ధరించారు. అధికారులు దగ్గరుండి మట్టి పో యించి కట్ట నిర్మాణం చేపట్టా రు. బాకారం జాగీర్ రెవెన్యూలో జంబులకుంట చెరువు కట్టను నిబంధనలకు విరుద్ధంగా తొలగించడంపై ‘పట్టాలు అడ్డుపెట్టి చెరువును చెరబట్టి’అనే శీర్షికతో ఆదివారం ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. అదే రోజు చెరువుకట్ట తొలగించిన ప్రదేశాన్ని పరిశీలించారు. చెరువు కట్ట తొలగించిన రైతునే పునరుద్ధరించాలని చెప్పారు. లేదంటే కేసు నమోదుచేస్తామని హెచ్చరించడంతో మంగళవారం రైతు మట్టి పోసి చెరువుకట్టను పునరుద్ధరించారు. ఇరిగేషన్ అధికారులు దగ్గరుండి జేసీబీ సహాయంతో చెరువు కట్ట పునఃనిర్మించారు. ఎవరైనా చెరువులు, కుంటల కట్టలు తొలగించినా, కాలువలు పూడ్చిన కఠిన చర్యలు ఉంటాయని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు.
ఆటో బోల్తా
గాయపడిన ప్రయాణికులు
కొందుర్గు: చౌదరిగూడ మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో బోల్తాపడి ప్రయాణికులు గా యపడ్డారు. మంగళవారం ఉదయం జిల్లేడ్ నుంచి చౌదరిగూడ వైపు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి చౌదరిగూడ సమీపంలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తు న్న భీమమ్మ, చిన్నయ్య, రాజు గాయపడినట్లు సమాచారం. డ్రైవర్ రాజుకు ఫిట్స్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
మొయినాబాద్ ఠాణాలో కేటీఆర్‌పై కేసు
మొయినాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఎం రేవంత్‌రెడ్డి ఫోటోలను బీఆర్‌ఎస్ నాయకులు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారంటూ నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాణయ్య మొయినాబాద్ ఠాణా లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్ సూచనలతోనే బీఆర్‌ఎస్ నాయకులు ఫొటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌రావు, డి.మచ్చు, కె.యాదగిరి, రవికిరణ్, మురళి, అనిల్, వర్ధన్, అభిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
చెరువు కట్ట పునరుద్ధరణ