మున్సిపాలిటీల్లో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కొన్ని చోట్ల అలంకార ప్రాయంగా మారాయి. మరికొన్ని చోట్ల నెలల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. కొత్తగా వెలుస్తున్న కాలనీలు రాత్రి వేళ అంధకారంలోనే మగ్గాల్సి వస్తోంది. ఆయా పురపాలికల్లో నిర్వహణ బాధ్యత చూడాల్సిన సంస్థ పట్టించుకోకపోవడంతో భారం మున్సిపాలిటీలపైనే పడుతోంది. మరోవైపు మున్సిపాలిటీల నుంచి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు పేరుకుపోతున్నాయి.
● మరమ్మతులు చేయరు.. కొత్తవి బిగించరు
● అంధకారంలోనే రహదారులు, కాలనీలు
● పేరుకుపోతున్న విద్యుత్ బిల్లులు
● మున్సిపాలిటీలకు భారంగా మారిన వైనం