శంషాబాద్ రూరల్: ర్యాపిడో ఆటోను బుక్ చేసుకున్న ముగ్గురు వ్యక్తులు.. హైదరాబాద్ నుంచి మండల శివారు ప్రాంతానికి వచ్చిన తర్వాత.. డ్రైవర్‌ను బెదిరించి ఆటోను దొంగిలించిన ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి సమాచారం మేరకు... ఉప్పల్‌లోని మేడిపల్లి ప్రాంతానికి చెందిన బ్రహ్మయాదవ్ ర్యాపిడో ద్వారా ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 13న ముగ్గురు వ్యక్తులు ఇతని ర్యాపిడో రైడ్‌లో బుక్ చేసుకున్నారు. ఉప్పల్ నుంచి మండలంలోని రాయన్నగూడ వద్దకు రాగా.. రాత్రి 10 గంటల సమయంలో బహర్భూమి కోసం ఆటోను ఆపారు. తర్వాత డ్రైవర్ బ్రహ్మయాదవ్‌ను బెదిరించి ఆటోతో పరారయ్యారు.
జైలుకు వెళ్లివచ్చినా మారని బుద్ధి
హైదరాబాద్‌లోని బండ్లగూడ ప్రాంతంలోని మహమ్మద్‌నగర్ వాసి మహ్మద్ రషీద్(26) ఆటో డ్రైవర్‌గా, బాలాపూర్ పరిధిలోని షాహిన్‌నగర్‌కు చెందిన షేక్ హసనుద్దీన్(22) డెకరేషన్ పని, మహ్మద్ ఆరీఫ్(25) ప్లంబర్‌గా పని చేస్తున్నారు. వీరు ర్యాపిడో రైడ్‌లో ఆటోను బుక్ చేసుకున్నారు. మార్గ మధ్యలో డ్రైవర్‌ను బెదిరించి ఆటోను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శనివారం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు గతంలో దొంగతనం, చైన్ స్నాచింగ్ కేసుల్లో జైలుకి వెళ్లారు. అయినా వారి ప్రవర్తన మార్చుకోలేదు. వీరి నుంచి పోలీసులు ఆటోను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చారు.
ర్యాపిడోలో బుక్ చేసుకుని...
మార్గ మధ్యలో ఆటోతో పరార్