షాబాద్: హత్య కేసులో నిందితుడికి జీవిత కారాగార శిక్ష విధించడంలో కీలకపాత్ర పోషించిన ట్రాఫిక్ అడ్మిన్ సీఐ గురువయ్యగౌడ్‌ను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అభినందించారు. 2023లో షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామర్లపల్లిలో జరిగిన హత్య కేసులో అప్పటి సీఐగా ఉన్న గురువయ్యగౌడ్ ఇన్వెస్టిగేషన్ చేసి చార్జిషీట్ కోర్టులో దాఖలు చేయగా నిందితుడికి జీవిత ఖైదు శిక్షపడింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ అవినాశ్‌మహంతి సీఐ గురువయ్యగౌడ్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. ప్రస్తుతం గురువయ్యగౌడ్ ట్రాఫిక్ అడ్మిన్ ఇన్‌స్పెక్టర్‌గా సైబరాబాద్ కమిషనరేట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.