పటాన్‌చెరు టౌన్: రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్త, కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు చెందిన మింటు గిరి బతుకుదెరువు కోసం వచ్చి ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి బైక్‌పై భార్య రంభా దేవి, కుమారుడు యూష్ (8) ముగ్గురూ బైక్‌పై ముత్తంగి వచ్చి తిరిగి ఇస్నాపూర్ వెళ్తున్నారు. మార్గమధ్యలో ఓల్డ్ మంజీరా బ్యాంక్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రంభా దేవి కిందపడగా టిప్పర్ మీది నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న గిరి, అతడి కుమారుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ ఢీకొని వ్యక్తి..
ఝరాసంగం(జహీరాబాద్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని కప్పాడ్ గ్రామానికి చెందిన పట్లోళ్ల రాచన్న(41) ఆదివారం రాత్రి భోజనం చేసి గ్రామం నుంచి సంగీతం వైపు స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రాయికోడ్ మండల పరిధిలోని కప్పాడ్ గ్రామానికి చెందిన అంజిరెడ్డి సింగితం వైపు నుంచి బైక్‌పై అతివేగంగా వచ్చి రాచన్నను ఢీకొట్టాడు. వెంటనే చికిత్స నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాచన్న కొన్నేళ్లుగా బీఆర్‌ఎస్ గ్రామ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఘటన విషయం తెలుసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నరోత్తంతో పాటు పలువురు కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొని యువకుడు
చిన్నశంకరంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నార్సింగి జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. నార్సింగి ఎస్‌ఐ అహ్మద్ మోహినోద్దీన్ కథనం మేరకు.. నార్సింగి వడ్డేర కాలనీకి చెందిన బోసు అశోక్ తన సోదరుడు నర్సింహులు కుమారుడు బోస్ ప్రభాస్(18)ని ట్రాక్టర్‌పై కూర్చోపెట్టుకొని నార్సింగి వైపు వస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి యూపీకి చెందిన కంటైనర్ వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రభాస్ ఎగిరి కిందపడిపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
కుమారుడికి స్వల్ప గాయాలు
బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్