నారాయణఖేడ్: ఎదురెదురుగా వ్యాన్, లారీ ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నిజాంపేట్–ఖేడ్–బీదర్ 161బి జాతీయ రహదారిపై ర్యాలమడుగు గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన వాజీద్ (35) మినీ వ్యాన్‌లో ఖేడ్‌లో మందులు సరఫరా చేసి తిరిగి వెళ్తున్నాడు. ర్యాలమడుగు సమీపంలోకి రాగానే నిజాంపేట్ వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజీద్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ వాహనంతో పరారు కాగా పోలీసులు కేసు నమోదు చేశారు.
కుక్కను తప్పించబోయి ..
స్కూటీపై నుంచి పడి యువకుడు మృతి
తూప్రాన్: స్కూటీ నుంచి కిందపడి యువకుడు దుర్మరణం చెందిన ఘటన పట్టణ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై లింగరెడ్డిపేట చౌరస్తా వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. మనోహరాబాద్ మండలం కూచారం గ్రామానికి చెందిన చాకలి బొంతపల్లి కృష్ణ (32) యువకుడు అనారోగ్యంతో పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి స్కూటీపై వచ్చాడు. తిరుగు ప్రయాణంలో లింగారెడ్డిపేట చౌరస్తా వద్ద రహదారిపై అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కిందపడి గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని
వాహనం ఢీకొని వ్యక్తి
నర్సాపూర్ రూరల్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నర్సాపూర్ – మెదక్ రహదారిలో రెడ్డిపల్లి గేటు వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. నర్సాపూర్ ఎస్‌ఐ లింగం కథనం మేరకు.. మేడ్చల్ జిల్లా దుండిగల్ గ్రామానికి చెందిన గడ్డమీది మహేశ్(33) రెడ్డిపల్లి గేటు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బైక్‌పై వెళ్తూ వ్యక్తి..
జగదేవ్‌పూర్(గజ్వేల్): బైక్‌పై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని మునిగడప గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రమోహన్ కథనం మేరకు.. వరంగల్ జిల్లా రామన్నపేట గ్రామానికి చెందిన నరేశ్(40) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లోని వినాయకనగర్‌లో భార్యా పిల్లలతో కలిసి ఉంటున్నాడు. బుధవారం స్వగ్రామం రామన్నపేట నుంచి బైక్‌పై బియ్యం బస్తా వేసుకొని బయలుదేరాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో మునిగడప గ్రామానికి రాగానే బైక్‌పై నుంచి కిందపడి ప్రాణాలు వదిలాడు. గుండెపోటు లేదా వడదెబ్బతో మృతి చెంది ఉన్నట్లు పోలీ సులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు.
ఐదు రోజుల వ్యవధిలో అన్నాదమ్ముళ్లు
హుస్నాబాద్‌రూరల్: ఐదు రోజుల వ్యవధిలో అన్మాదమ్ముళ్లు మృతి చెందిన ఘటన హుస్నాబాద్ మండలం నాగారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పొన్నాల లచ్చవ్వ లింగయ్య దంపతులకు ముగ్గురు కుమారులు ఉండగా అందరికీ పెళ్లీలు అయ్యాయి. అనారోగ్యంతో 14న పొన్నాల ప్రభాకర్ మృతి చెందగా, బుధవారం పొన్నాల రవీందర్ సిద్దిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరు కుమారుల మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. రవీందర్ గ్రామ పంచాయతీ కార్మికుడిగా పని చేస్తుండగా, ప్రభాకర్ హుస్నాబాద్ పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు.
నిషేధిత ఆల్ఫాజోలం పట్టివేత
పోలీసుల అదుపులో ఇద్దరు
హత్నూర( సంగారెడ్డి): ఓ ఇంటిపై ఎకై ్సజ్ ఇన్‌ఫోర్స్‌మెంట్ పోలీస్ అధికారులు దాడి చేసి నిషేధిత ఆల్ఫాజోలం పట్టుకున్నారు. ఈ ఘటన హత్నూర మండలం దౌల్తాబాద్ బస్టాండ్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రొఫెషనల్ అండ్ ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మెదక్ డివిజన్ ఏఈ ఎస్‌కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. అధికారుల కథనం మేరకు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన రాజా గౌడ్, సిద్దిపేట ప్రాంతానికి చెందిన చిత్తాపూర్ గ్రామానికి చెందిన నర్సాగౌడ్ ఇద్దరూ నిషేధిత ఆల్ఫాజోలం 503 గ్రాములు, డయజోఫామ్ 17 గ్రాములు ఇంట్లో నిల్వ చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి సుమారు రూ.5 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు పట్టుకున్నాం. ఇద్దరిని అదుపులోకి తీసుకొని అందోల్ ఎకై ్సజ్ సీఐకి అప్పగించినట్లు తెలిపారు.
లారీ, వ్యాన్ ఢీ: డ్రైవర్ మృతి