నాలావద్ద చెత్తా చెదారాన్ని తొలగిస్తున్న జేసీబీ
నారాయణఖేడ్: మండలంలోని హన్మంత్‌రావుపేట్ చేనేత కార్మికుల బతుకు చిత్రం గురించి ‘సాక్షి’ దినపత్రికలో ‘సిరుల దారం.. నిరాధారం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి చేనేత సహకార సంఘం జిల్లా నాయకులు స్పందించారు. ఆదివారం గ్రామాన్ని సంఘం జిల్లా, స్థానిక బాధ్యు లు సందర్శించారు. మార్కండేయ చేనేత సహకార సంఘం దీన స్థితిని తెలుసుకొన్నారు. గ్రామంలోని చేనేత కార్మికులు, డైరెక్టర్లతో సమావేశమయ్యారు. సేకరించిన సమాచారాన్ని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్తామని, మూతబడ్డ సంఘాన్ని తిరిగి ప్రారంభించేలా కృషి చేస్తామని వారికి హామీనిచ్చారు. కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, సాయిలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన నాలాలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఆదివారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ నెల 23న ‘సాక్షి’ దినపత్రికలో ‘పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు’అనే శీర్షికన ప్రచురితమైన వార్తకు అధికార యంత్రాంగం స్పందించింది. పట్టణంలోని గడి నుంచి సిద్దేశ్వర ఆలయం వైపు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నాలా నిండిపోయింది. రెండురోజులుగా కురుస్తోన్న వర్షాలకు నాలలో మురికినీరు రోడ్డుపై పారుతుంది. దీంతో ప్రజలు తీవ్రం ఇబ్బందులు పడ్డారు. మున్సిపల్ అధికారులు జేసీబీ సహయంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.
హన్మంత్‌రావుపేట్‌కు అండగా...
హన్మంత్‌రావుపేట్‌కు అండగా...