చేగుంట(తూప్రాన్): రోడ్డు దాటుతున్న మహిళను బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన స్టేషన్ మాసాయిపేటలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కొట్టాల గ్రామానికి చెందిన బోదాసు సాయవ్వ(43) కామారెడ్డి నుంచి రైలులో స్టేషన్ మాసాయిపేటకు చేరుకుంది. రైలు దిగి తూప్రాన్ వెళ్లడానికి జాతీయ రహదారిపైకి వచ్చి రోడ్డు దాటుతుండగా చేగుంట వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి అన్న సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉపాధి హామీ కూలీ
ఝరాసంగం(జహీరాబాద్): ఉపాధి హామీ కూలీ మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ చాంద్ బీ(55) మంగళవారం ఉదయం కూలీ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఆకస్మాతుగా కింద పడిపోయింది. అక్కడికక్కడే మృతి చెందడంతో విషయాన్ని తోటి కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఎంపీడీఓ సుధాకర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి
చేర్యాల(సిద్దిపేట): ప్రమాదవశాత్తు బావిలో పడి గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. మండల పరిధిలోని ముస్త్యాల గ్రామానికి చెందిన చిగురు రాజయ్య(68) ఈనెల 18న వ్యవసాయ బావిలో మోటారు బయటకు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా మంగళవారం తెళ్లవారుజామున మృతి చెందాడు.
బస్సు ఢీకొని మహిళ మృతి