పట్టభద్రులు కాంగ్రెస్ వైపే
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టభద్రులు కాంగ్రెస్ వైపే ఉన్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తథ్యమని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సిద్దిపేట పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం, రావిచెట్టు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. అందుకే బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. నిరుద్యోగులకు, పట్టభద్రులకు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పట్టభద్రులు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తుంకుంటా నర్సారెడ్డి, హరికృష్ణ , చెరుకు శ్రీనివాస్ రెడ్డి, అత్తు ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
మంత్రితో కలిసి సిద్దిపేటలోప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment