
రాజీమార్గం.. సత్వర న్యాయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి ● లోక్ అదాలత్‌లో 3,622 కేసుల పరిష్కారం
సిద్దిపేటకమాన్: క్షణికావేశంలో చేసిన తప్పులను, పెండింగ్ కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ సరైన వేదిక అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు రాజీ మార్గం ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో 3,557 క్రిమినల్, 50 సివిల్, 15 మోటారు ప్రమాద కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద కేసుల్లో రూ.1,01,65,000 బాధితులకు ఇప్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్‌కాంబ్లి, శ్రావణి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమయం వృథా చేసుకోవద్దు
హుస్నాబాద్: లోక్ అదాలత్‌లో రాజీ మార్గంతో వివిధ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురికి న్యాయం జరుగుతుందని ప్రిన్సిపాల్ సివిల్ కోర్టు అదనపు జడ్జి కృష్ణతేజ్ అన్నారు. శనివారం కోర్టు హాలులో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ్ మాట్లాడుతూ క్షణికావేశంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లకు కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని వృథా చేసుకోవద్దన్నారు. సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునే గొడవలను కోర్టుల దాకా తెస్తున్నారన్నారు. రాజీ మార్గంతో కేసులను పరిష్కరించుకోవాలని జడ్జి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment