
ఎవరికీ పట్టని ప్రజావాణి!
డిజిటల్ జమానా.. జేబులో ఫోన్ ఉంటే చాలు వివిధ రకాల చెల్లింపులకు నగదు బదిలీ సాధారణమైంది. తాజాగా ఈ ట్రెండ్ వివాహ వేడుకలకూ పాకింది. వివాహ వేడుకకు హాజరైన వారు డిజిటల్ పద్ధతిలో కూడా కట్నాలు చదివించుకోవచ్చు అన్నట్లు సంబంధీకులు ‘క్యూఆర్’ కోడ్ స్కానర్‌ను అందుబాటులో పెట్టారు. పెళ్లికి వచ్చిన వారు దీనిని చూసి నయా ట్రెండ్ భళే ఐడియా అంటూ ఆశ్చర్యపోయారు. డిజిటల్ కట్నాలు చదివించడం వర్గల్ మండలం గౌరారంలో చోటుచేసుకుంది. – వర్గల్(గజ్వేల్)
మండుతున్న ఎండలకు మనుషులే తట్టుకోలేక పోతున్నారు. ఇక మూగ జీవాల సంగతి సరేసరి. కోతులు ఎండ వేడిమిని భరించలేక చెట్ల నీడను ఆశ్రయిస్తున్నాయి. మిరుదొడ్డిలో మిట్ట మధ్యాహ్నం వేళ వానరాలు స్థానిక పెద్దచెరువు కట్టపై ఉన్న చెట్ల నీడన చేరి ఉపశమనం పొందుతున్న ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌మనిపించింది. – మిరుదొడ్డి(దుబ్బాక)
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment