లీడ్స్: ఏడాదిన్నర కాలంగా పేలవ ఫామ్‌లో ఉన్న భారత టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే లార్డ్స్ టెస్టులో కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయానికి పునాది వేశాడు. 2020నుంచి చూస్తే 27.36 సగటుతో మాత్రమే పరుగులు చేసిన అతను రెండో టెస్టులో 61 పరుగులు చేసి మళ్లీ తన విలువేమిటో చూపించాడు. తనపై కొంత కాలంగా వస్తున్న విమర్శల గురించి బాగా తెలుసని, అయితే అవేమీ పట్టించుకోకుండా జట్టు గెలుపులో తన పాత్ర ఏమిటన్నదే ఆలోచిస్తానని రహానే వ్యాఖ్యానించాడు.
చదవండి: ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్
‘నా గురించి జనం చాలా మాట్లాడుకుంటున్నారు. నాకు సంతోషమే. నేనేమీ అసహనానికి గురి కావడం లేదు. ఎందుకంటే గుర్తింపు ఉన్నవారు, ప్రముఖుల గురించి అందరూ మాట్లాడుతారు. నేను జట్టుకు ఏం చేశాననేది అన్నింటికంటే ముఖ్యం. నేను, పుజారా సుదీర్ఘ కాలంగా ఆడుతున్నాం. ఒత్తిడిలో ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు. అందుకే గత మ్యాచ్ సమయంలో బయటి విమర్శలను పట్టించుకోకుండా పరుగులు చేయడంపైనే దృష్టి పెట్టాం. మన చేతుల్లో లేనిదాని గురించి ఏమీ చేయలేం’ అని రహానే స్పందించాడు. భారత్ తరఫున ఆడటమే అన్నింటికంటే ఎక్కువ ప్రేరణగా పని చేస్తుందన్న రహానే... శార్దూల్ ఠాకూర్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, మూడో టెస్టుకు సిద్ధమని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment