
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇక మిగిలిన నామమాత్ర వన్డే మ్యాచ్ శుక్రవారం జరగనుంది. సిరీస్ సొంతం కావడంతో టీమిండియా మూడోవన్డేలో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అయితే ఒక్కటి మాత్రం అలాగే మిగిలిపోయింది. విండీస్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ కోహ్లి అంతగా ఆకట్టుకోలేదు. తొలి వన్డేలో 8 పరుగులు చేసిన కోహ్లి.. రెండో వన్డేలో 18 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కనీసం ఈ సిరీస్‌లోనైనా సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని భావించిన ఫ్యాన్స్‌కు కోహ్లి నిరాశనే మిగిల్చాడు. ఇక మిగిలిన వన్డేలోనైనా సెంచరీ కొడతావా లేక మరోసారి ఆ కలను కలగానే మిగిలిస్తావా అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: రోహిత్ శర్మ.. పట్టిందల్లా బంగారమే
కాగా కోహ్లి తన చివరి సెంచరీని 2019 నవంబర్‌లో సాధించాడు. అప్పటినుంచి 811 రోజులపాటు కోహ్లి సెంచరీ లేకుండా ఉన్నాడు. మధ్యలో రెండు, మూడుసార్లు సెంచరీకి దగ్గరగా వచ్చినప్పటికి ఆ ఫీట్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. తన 71వ సెంచరీని విండీస్‌తో మూడోవన్డేలో అందుకుంటాడేమో చూడాలి.ఒకవేళ కోహ్లి సెంచరీ కొడితే మాత్రం పలు రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.
►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల విషయంలో కోహ్లి మూడోస్థానంలో ఉన్నాడు.
►అన్ని ఫార్మాట్లు(టెస్టు, వన్డే, టి20) కలిపి కోహ్లి ఇప్పటివరకు 70 సెంచరీలు సాధించాడు. రికీ పాంటింగ్ 71 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ మూడో వన్డేలో సెంచరీ సాధిస్తే.. పాంటింగ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగనున్నాడు.
►ఇక 2019లో వెస్టిండీస్‌పై వన్డే సెంచరీ అందుకున్న కోహ్లి.. ఇప్పటివరకు విండీస్‌పై 42 వన్డేల్లో 9 సెంచరీలతో 2269 పరుగులు సాధించాడు.
చదవండి: Rishabh Pant: కాపీ కొట్టడానికి సిగ్గుండాలి.. పంత్‌పై ట్రోల్స్ వర్షం
Comments
Please login to add a commentAdd a comment