టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో విరాట్ కోహ్లి
India training ఢamp for Asia Cup 2023- Yo-Yo Test- Top Scorer Not Kohli!: యో-యో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టినట్లు సమాచారం. ఆలూరులో నిర్వహించిన ఈ ఫిట్‌నెస్ పరీక్షలో భారత ఆటగాళ్లందరిలో అతడే టాప్ స్కోరర్‌గా నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆసియా కప్-2023 సన్నాహకాల్లో భాగంగా బీసీసీఐ.. క్రికెటర్లకు ప్రత్యేక శిక్షణా శిబిరం నిర్వహిస్తోంది.
తన స్కోరు వెల్లడించిన కోహ్లి
ఇందులో భాగంగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్న ఆటగాళ్ల సన్నద్ధతను తెలుసుకునేందుకు ఫిట్‌నెస్ టెస్టులు చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి యో-యో టెస్టులో పాసైనట్లు సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే.
కోహ్లికి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ!
తాను 17.2 స్కోరు చేసినట్లు తెలుపుతూ ఇన్‌స్టా స్టోరీలో ఫొటో షేర్ చేశాడు. అయితే, కోహ్లి చేసిన పని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఆగ్రహం తెప్పించింది. జట్టుకు సంబంధించిన అంతర్గత విషయాలు బయటపెట్టవద్దని బీసీసీఐ రన్‌మెషీన్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి.
టాప్ స్కోరర్ గిల్.. స్కోరెంతంటే!
ఈ క్రమంలో.. తాజాగా శుబ్‌మన్ గిల్‌కు సంబంధించిన యో- యో టెస్టు స్కోరు బహిర్గతం కావడం గమనార్హం. వార్తా సంస్థ పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. గిల్ ఈ పరీక్షలో 18.7 స్కోరు చేసినట్లు తెలుస్తోంది.
బుమ్రాతో పాటు వాళ్లు కూడా!
ఇదిలా ఉంటే.. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ కృష్ణ.. బ్యాటర్లు తిలక్ వర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ మినహా మిగతా వాళ్లంతా ఇప్పటికే ఫిట్‌నెస్ పరీక్ష ఎదుర్కొనట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. భారత క్రికెటర్లలో అత్యధిక మంది యో- యో టెస్టులో 16.5 నుంచి 18 మధ్య స్కోరు చేస్తారని పేర్కొన్నాయి.
తొలుత పాకిస్తాన్‌తో
కాగా ఆగష్టు 30 నుంచి పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఈసారి వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ ఈవెంట్‌లో టీమిండియా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థుల పోరుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదిక కానుంది. దాయాదితో సమరం తర్వాత రోహిత్ సేన నేపాల్‌తో సెప్టెంబరు 4న తదుపరి మ్యాచ్ ఆడనుంది.
చదవండి: Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
Comments
Please login to add a commentAdd a comment