భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఇక క్రికెట్ ప్రేమికులు అతృతగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఆక్టోబర్ 15న అహ్మదాబాద్ జరగనుంది.
ఈ దాయాదుల పోరుకు ఇంకా రెండు నెలల పైగా సమయం ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్‌లో విజేత ఎవరన్నది ఇప్పటి నుంచే మాజీలు అంచనాలు వేస్తున్నారు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజం వకార్ యూనిస్ చేరాడు. వన్డే వరల్డ్‌కప్‌లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు భారత్‌పై గెలిచే అన్ని అవకాశాలను కలిగి ఉందని యూనిస్ జోస్యం చెప్పాడు.
"భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే సాధారణంగా ఒత్తిడి ఉంటుంది. ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లొ అయితే అది మూడు రెట్లు పెరుగుతుంది. గత కొన్ని వరల్డ్‌కప్ ఎడిషన్‌లలో భారత్‌పై మేము బాగా ఆడుతున్నాం. టీ20 ప్రపంచకప్-2021లో మేము విజయం సాధించాం. గతేడాది జరిగిన వరల్డ్‌కప్‌లో కూడా టీమిండియాను ఓడించే అంత పనిచేశాం.
మా జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడిని మెరుగ్గా నిర్వహిస్తున్నారు. బాబర్ ఆజం, షాహీన్, ఫఖర్ జమాన్ వంటి ఒంటి చేత్తో జట్టును గెలిపించగలరు. కాబట్టి ఈ ఏడాది ప్రపంచకప్‌లో భారత జట్టును పాకిస్తాన్ ఓడిస్తుందని నేను నమ్ముతున్నాను" అని క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యానిస్ పేర్కొన్నాడు.
చదవండి: #Alex Steele: 83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment