న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం టెస్టు, వన్డే, టీ20 జట్టులను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. కాగా, రోహిత్ శర్మకు అటు టెస్టు జట్టులో కానీ ఇటు వన్డే జట్టులో కానీ చోటు దక్కలేదు. ప్రస్తుత ఐపీఎల్‌లో తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్‌కు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టులో చోటు కల్పించలేదని బీసీసీఐ తెలిపింది. రోహిత్ గాయాన్ని బీసీసీఐ మెడికల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేసింది. మరొకవైపు ఇషాంత్ శర్మకు సైతం స్థానం కల్పించలేదు. గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరం కావడమే ఇందుకు కారణం. ఇషాంత్ గాయాన్ని కూడా బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తోంది.
మరొకవైపు టెస్టు జట్టులో మాత్రమే రిషభ్ పంత్ అవకాశాన్ని ఇచ్చారు. వన్డేలకు, టీ20లకు పంత్‌కు చోటు దక్కలేదు. టీమిండియా టెస్టు జట్టులో వృద్ధిమాన్ సాహాకు అవకాశం ఇచ్చారు. ఇక కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పిన్నర్ వరుణ్ చక‍్రవర్తికి తొలిసారి టీమిండియా టీ20 జట్టులో చోటు దక్కింది. మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌లకు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇక ఆసీస్ పర్యటనలో మూడు ఫార్మాట్లలో కోహ్లినే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.(బుమ్రా యాక్షన్..ఆర్చర్ రియాక్షన్!)
టెస్టు జట్టు
విరాట్ కోహ్లి(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), హనుమ విహారి, శుబ్‌మన్ గిల్, సాహా(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, సిరాజ్
వన్డే జట్టు
విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, గిల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్-వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా. మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్
టీ20 జట్టు
విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్-వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, చహల్, బుమ్రా, మహ్మద్ షమీ, సైనీ, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తి
Comments
Please login to add a commentAdd a comment