IPL 2024 షెడ్యూల్‌లో మార్పులు.. బీసీసీఐ ప్రకటన | BCCI Reschedules 2 IPL 2024 Matches KKR RR GT DC To Be Affected | Sakshi
Sakshi News home page

IPL 2024 షెడ్యూల్‌లో మార్పులు.. బీసీసీఐ ప్రకటన

Published Tue, Apr 2 2024 4:38 PM | Last Updated on Tue, Apr 2 2024 7:39 PM

BCCI Reschedules 2 IPL 2024 Matches KKR RR GT DC To Be Affected - Sakshi

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (PC: BCCI)

ఐపీఎల్‌-2024 షెడ్యూల్‌లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి రెండు కీలక మార్పులు చేసింది. ఏప్రిల్‌ 16, ఏప్రిల్‌ 17 నాటి మ్యాచ్‌లను రీషెడ్యూల్‌ చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఏప్రిల్‌ 17న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్‌ 16న నిర్వహించనున్నారు.

మరోవైపు.. ఏప్రిల్‌ 16న అహ్మదాబాద్‌లో జరగాల్సిన గుజరాత్‌ టైటాన్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను ఒకరోజు వాయిదా వేశారు. ఏప్రిల్‌ 17న ఈ మ్యాచ్‌ నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

అయితే, ఈ రెండు రోజుల షెడ్యూల్‌ను ఈ మేరకు మార్చడానికి గల కారణాన్ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. పీటీఐ కథనం ప్రకారం.. రామ నవమి కారణంగానే కేకేఆర్‌- రాజస్తాన్‌ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేసినట్లు తెలుస్తోంది.

కారణం ఇదేనా?
పండుగ, వరుస మ్యాచ్‌లు, ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌ పోలీసులు తగినంత భద్రత కల్పించే విషయంలో భరోసా ఇవ్వకపోవడంతోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ బెంగాల్‌ ఈ మ్యాచ్‌ను ఒకరోజు ముందు నిర్వహించడం లేదంటే ఒకరోజు వాయిదా వేయమని కోరగా బీసీసీఐ ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

వరుస విజయాల జోష్‌లో
కాగా కేకేఆర్‌ ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో గెలుపొంది జోరు మీద ఉంది. తొలుత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను.. తర్వాత రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును శ్రేయస్‌ సేన ఓడించింది. తదుపరి బుధవారం నాటి ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ కోసం విశాఖపట్నం చేరుకుంది. ఆ మ్యాచ్‌ తర్వాత ఏప్రిల్‌ 14న సొంతమైదానంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది.

రెండు మ్యాచ్‌లకు సంబంధించి రివైజ్డ్‌ షెడ్యూల్‌
1. ఏప్రిల్‌ 16- మంగళవారం- కేకేఆర్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌- ఈడెన్‌ గార్డెన్స్‌, కోల్‌కతా.
2. ఏప్రిల్‌ 17- బుధవారం- గుజరాత్‌ టైటాన్స్‌ వర్సెస్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్‌.

చదవండి: బ్యాడ్‌న్యూస్‌.. మళ్లీ ధోని బ్యాటింగ్‌ చూడలేమా?!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement