GT Vs CSK: Ben Stokes Brutally Trolled As CSKs Costliest Player Fails With Bat - Sakshi
Sakshi News home page

IPL 2023- Ben Stokes:16 కోట్లు! ఇంతకీ ఏం చేశాడు? దండుగ అంటూ ట్రోల్స్‌! కానీ..

Published Sat, Apr 1 2023 3:48 PM | Last Updated on Sat, Apr 1 2023 4:42 PM

Ben Stokes Brutally Trolled As CSKs Costliest Player Fails With Bat - Sakshi

Photo Credit : IPL Website

ఐపీఎల్‌-2023ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమితో ఆరం‍భించింది. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 179 పరుగుల లక్ష్యాన్ని సీఎస్‌కే కాపాడుకోలేకపోయింది. అదే విధంగా ఆ జట్టు ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌(50 బంతుల్లో 92) అద్భుత ఇన్నింగ్స్‌ కూడా వృథా అయిపోంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలర్లు కూడా దారుణంగా విఫలమయ్యారు.

నిరాశ పరిచిన బెన్‌ స్టోక్స్‌
కాగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ మినీవేలంలో ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ను రూ. 16.25 కోట్ల భారీ మొత్తం వెచ్చించి సీఎస్‌కే కొనుగోలు చేసింది. అయితే గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బెన్‌ స్టోక్స్‌ తీవ్ర నిరాశపరిచాడు. బ్యాటింగ్‌లో నాలుగో స్థానంలో వచ్చిన స్టోక్స్‌ కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. స్టోక్స్‌ను గుజరాత్‌ వికెట్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహా అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు.

అదే విధంగా ఆల్‌రౌండర్‌గా సేవలు అందిస్తాడని స్టోక్స్‌పై సీఎస్‌కే అతడిపై భారీ మొత్తాన్ని వెచ్చింది. కానీ ఈ మ్యాచ్‌లో స్టోక్స్‌ కనీసం ఒక్క ఓవర్‌ కూడా వేయలేదు. అతడు ఫీల్డింగ్‌లో కూడా పెద్దగా అకట్టుకోలేకపోయాడు. ఇక తొలి మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన స్టోక్స్‌పై సీఎస్‌కే అభిమానులు మండిపడుతున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా స్టోక్స్‌ను ట్రోలు చేస్తున్నారు. ఈ మాత్రం దానికి రూ. 16.25 కోట్ల దండుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొ‍ంతమంది స్టోక్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కేవలం ఒక్క మ్యాచ్‌తోనే అతడిని విమర్శించడం సరి కాదని అభిప్రాయడతున్నారు.
చదవండిIPL 2023: ప్లీజ్‌.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు! ఆ ‘మహానుభావుడేమో’..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement