స్టీవ్ స్మిత్
India vs Australia, 4th Test Day 1: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా టీమిండియాతో మూడో టెస్టులో జట్టును గెలిపించి నీరాజనాలు అందుకుంటున్నాడు తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్. తొలి రెండు టెస్టుల్లో దారుణ పరాజయంతో విలవిల్లాడి పోయిన కంగారూలకు ఇండోర్ విజయం భారీ ఊరటనిచ్చిన మాట వాస్తవం.
తల్లి అనారోగ్యం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశానికి వెళ్లిపోగా.. అతడి స్థానంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు స్మిత్. సారథిగా తనకున్న అనుభవాన్ని రంగరించి తనవైన వ్యూహాలతో జట్టుకు విజయం అందించాడు.
అతడి సారథ్యంలో తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా నేరుగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది. తొలిసారి డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ వంటి ఆసీస్ మాజీ క్రికెటర్లు స్మిత్‌ను మళ్లీ కెప్టెన్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ..
ఇదంతా బాగానే ఉంది కానీ.. బ్యాటర్‌గా మాత్రం స్మిత్ దారుణంగా విఫలమైన విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు విశ్లేషకులు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటి వరకు స్మిత్ చేసిన పరుగులు వరుసగా 37, 25 నాటౌట్, 0, 9, 26, 38. నాగ్‌పూర్ టెస్టులో 37.. తాజాగా అహ్మదాబాద్ టెస్టులో తొలి రోజు ఆటలో భాగంగా 38. ఇప్పటి వరకు స్మిత్ అత్యధిక స్కోరు ఇదే.
కెరీర్‌లో ఇదే తొలిసారి
నిజానికి తన కెరీర్‌లో ఇలా వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లో స్మిత్ కనీసం 50 పరుగుల మార్కు దాటకపోవడం ఇదే తొలిసారి. దీనిని బట్టి ఈ సిరీస్‌లో స్మిత్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ సిరీస్ ఆరంభం నుంచి పరుగులు రాబట్టడానికి ఇరు జట్ల బ్యాటర్లు కష్టపడుతున్నారు.
తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ తర్వాత తాజాగా ఉస్మాన్ ఖవాజా(104- నాటౌట్) మాత్రమే మూడంకెల మార్కును అందుకోగలిగాడు. అయితే.. పిచ్ సంగతి ఎలా ఉన్నా.. స్టార్ బ్యాటర్‌గా పేరున్న స్మిత్ కనీసం అర్ధ శతకం కూడా సాధించకపోవడం పట్ల అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇక అహ్మదాబాద్‌లో టెస్టులో మరోసారి టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు దొరికిపోయిన స్మిత్.. ఈ సిరీస్‌లో అతడి బౌలింగ్‌లో అవుటవడం ఇది మూడోసారి.
చదవండి: Ind Vs Aus: జడ్డూ దెబ్బకు స్టంప్స్ ఎగిరిపోయాయి! అంత ఓవరాక్షన్ ఎందుకు స్మిత్? వీడియో వైరల్
BGT 2023: తొలి ఓవర్లోనే షమీకి చేదు అనుభవం.. తర్వాత అద్భుత డెలివరీతో! దెబ్బకు..
Comments
Please login to add a commentAdd a comment