IPL 2022: Chahal Reveals Reason Behind Recreating 2019 World Cup Meme-Pose After Hat-Trick - Sakshi
Sakshi News home page

IPL 2022: చహల్‌ హ్యాట్రిక్‌.. ఆ పోజుతో ప్రతీకారం తీర్చుకున్నాడా! 

Published Wed, Apr 20 2022 10:12 AM | Last Updated on Wed, Apr 20 2022 12:49 PM

Chahal Reveal Reason Recreate 2019 World Cup Meme-Pose Hat-trick IPL 2022 - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ యజ్వేంద్ర చహల్‌ తొలి హ్యాట్రిక్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌తో మ్యాచ్‌లో చహల్‌ ఈ ఫీట్‌ సాధించాడు. హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించి అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే హ్యాట్రిక్‌ తీసిన ఆనందంలో చహల్‌ ఇచ్చిన పోజు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. 

తాజాగా తన పోజు వెనకున్న విషయాన్ని మ్యాచ్‌‌‌‌ అనంతరం చహల్‌‌‌‌ వెల్లడించాడు. 2019 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టైమ్‌‌‌‌లో మీమ్‌‌‌‌గా మారిన తన పోజునే మళ్లీ రిపీట్‌‌‌‌ చేశానని చెప్పాడు. ఆ టోర్నీలో ఓ మ్యాచ్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో చహల్‌కు చోటు దక్కలేదు. దీంతో డ్రింక్స్‌ బాయ్‌గా మారిన అతను ప్లేయర్లకు డ్రింక్స్‌‌‌‌ అందించాడు. ఈ క్రమంలో  బౌండరీ లైన్‌‌‌‌ అవతల రెండు కాళ్లు చాపి తాపీగా కూర్చొని పోజు ఇచ్చాడు. ఆ ఫోటోపై అప్పట్లో చహల్‌పై విపరీతమైన మీమ్స్‌ వచ్చాయి.

జట్టులో చోటు దక్కక డ్రింక్స్‌ బాయ్‌గా మారిపోయాడని.. ఏం చేయాలో తెలియక ఇలా పోజు ఇచ్చాడంటూ కామెంట్స్‌ చేశారు. ఈ మాటలు మనుసులో పెట్టుకున్నాడేమో తెలియదు కాని.. తాజాగా చహల్‌ దానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. ఇక, కేకేఆర్​తో మ్యాచ్‌‌‌‌లో గూగ్లీలతో రాణా, వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన చహల్‌‌‌‌.. లెగ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌తో కమిన్స్‌‌‌‌ వికెట్‌‌‌‌ పడగొట్టి హ్యాట్రిక్‌‌‌‌ సాధించాడు. వాస్తవానికి ఈ బాల్‌‌‌‌ కూడా గూగ్లీ వేయాలనుకున్నప్పటికీ.. చాన్స్‌‌‌‌ తీసుకోవద్దని లెగ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ వేశానని చహల్‌‌‌‌ చెప్పాడు.

చదవండి: Chahal Hat-Trick: చహల్‌ పేరిట వెబ్‌సైట్‌.. ఆ మాత్రం ఉండాలి!

Yuzvendra Chahal: ఐపీఎల్‌ చరి‍త్రలో చహల్‌ కొత్త రికార్డు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement