
ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు యజ్వేంద్ర చహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ధనశ్రీలో మంచి డ్యాన్సర్ ఉందన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇప్పటికే ఆమె తన డ్యాన్స్ నైపుణ్యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాజగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న బాధితులకు అండగా ఒక డ్యాన్స్ వీడియోను రిలీజ్ చేసింది. ప్రఖ్యాత అమెరికన్ రాపర్ సౌలిజా బాయ్స్ రూపొందించిన షీ మేక్ ఇట్ క్లాప్ పాటకు ధనశ్రీ డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన డ్యాన్స్‌తో పాటు గెటప్‌తోనూ ఆకట్టుకుంది. ఆర్‌సీబీ జెర్సీ .. బ్లూ ప్యాంట్ ధరించి స్టెప్స్‌తో ఇరగదీసింది.
దీనికి సంబంధించిన వీడియోనూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ లిస్టులో చేరింది. కాగా చహల్ తల్లిదండ్రులు కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. అతని తల్లి హోం ఐసోలేషన్‌లో ఉండగా.. తండ్రి మాత్రం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. కాగా యజ్వేంద్ర చహల్ ఐపీఎల్ 14వ సీజన్‌లో ఆర్‌సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. కరోనా సెగతో లీగ్ రద్దు కావడంతో చహల్ ఇంటికి చేరుకున్నాడు. ఇక ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు చహల్ పేరును పరిగణలోకి తీసుకోలేదు. అయితే జూలైలో శ్రీలంక పర్యటనకు చహల్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి.
చదవండి: RCB VS SRH: అరిచి అరిచి నా గొంతు పోయింది
పేరెంట్స్‌కు కరోనా.. చహల్ ఎమోషనల్ పోస్ట్