CWC 2023 Ind vs Aus: వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ.. ఆసీస్‌పై విజయం | CWC 2023, 5th Match: India vs Australia Updates And Highlights | Sakshi
Sakshi News home page

CWC 2023 India vs Australia: వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ.. ఆసీస్‌పై విజయం

Published Sun, Oct 8 2023 1:28 PM | Last Updated on Sun, Oct 8 2023 9:51 PM

CWC 2023, 5th Match: India vs Australia Updates And Highlights - Sakshi

ICC Cricket World Cup 2023- India vs Australia, 5th Match Updates:
వరల్డ్‌కప్‌లో టీమిండియా బోణీ.. ఆసీస్‌పై విజయం

కోహ్లి అవుట్‌
37.4: హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి నిష్క్రమించాడు. స్కోరు: 167/4 (37.4). రాహుల్‌ 75, హార్దిక్‌ పాండ్యా క్రీజులో ఉన్నారు.

35 ఓవర్లలో టీమిండియా స్కోరు: 151/3
గెలుపునకు 90 బంతుల్లో 49 పరుగులు అవసరం

టార్గెట్‌ ఛేదన దిశగా టీమిండియా
వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆసీస్‌తో మ్యాచ్‌లో టీమిండియా లక్ష్య ఛేదన దిశగా పయనిస్తోంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ అద్బుత భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కోహ్లి 72, రాహుల్‌ 62 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 141/3 (33.4)

30 ఓవర్లలో టీమిండియా స్కోరు: 120/3
కోహ్లి 60, రాహుల్‌ 54 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రాహుల్‌ హాఫ్‌ సెంచరీ
కోహ్లి 59, రాహుల్‌ 59 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 115/3 (27.5)

 అర్ధ శతకం పూర్తి చేసుకున్న కోహ్లి.. టీమిండియా సెంచరీ
విరాట్‌ కోహ్లి 75 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్‌ 47 పరుగులతో ఆడుతున్నాడు. దీంతో 25.3 ఓవర్లలో టీమిండియా 100 పరుగుల మార్కు అందుకుంది. స్కోరు: 100/3 (25.4)

24 ఓవర్లలో టీమిండియా స్కోరు: 92/3
కోహ్లి 45, రాహుల్‌ 44 పరుగులతో అర్ధ శతకాల దిశగా పయనిస్తున్నారు.

21 ఓవర్లలో టీమిండియా స్కోరు: 82/3
కోహ్లి 39, రాహుల్‌ 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ చక్కదిద్దుతున్నారు.

18 ఓవర్లలో భారత్‌ స్కోరు: 69-3
కోహ్లి 34, రాహుల్‌ 32 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

లక్ష్యం 200.. 15 ఓవర్లలో భారత్‌ స్కోరు: 49/3
కోహ్లి 31, రాహుల్‌ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కోహ్లి, రాహుల్‌ నిలకడగా..
2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు నిలకడగా ఆడుతుండటంతో 13 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 38 పరుగులు చేయగలిగింది. కోహ్లి 21, రాహుల్‌ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కష్టాల్లో భారత్‌..
200 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుస క్రమంలో ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ పెవిలియన్‌కు చేరారు. వీరిముగ్గురూ కూడా డకౌట్‌గానే వెనుదిరగడం గమనార్హం. కిషన్‌ను స్టార్క్‌ ఔట్‌ చేయగా.. రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌ హాజిల్‌ వుడ్‌ బౌలింగ్‌లో ఔటయ్యారు.

ఆదిలోనే ఎదురుదెబ్బ
0.4: స్టార్క్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌. తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌. 

చెలరేగిన భారత బౌలర్లు.. 199 పరుగులకు ఆసీస్‌ ఆలౌట్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా అందుకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. భారత బౌలర్ల దాటికి 199 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు సాధించారు. వీరిద్దరితో పాటు సిరాజ్‌, అశ్విన్‌, హార్దిక్‌ చెరో వికెట్‌ సాధించారు. ఆసీస్‌ బ్యాటర్లలో స్టీవ్‌ స్మిత్‌(46) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

165 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్యాట్ కమ్మిన్స్‌.. బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

36.2: ఏడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
అశ్విన్‌ బౌలింగ్‌లో గ్రీన్‌(8) పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 
140/7

35.5: కుల్దీప్‌ బౌలింగ్లో మాక్సీ(15) అవుట్‌. ఆరో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడ్డ ఆసీస్‌

35 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు: 138/5
మాక్సీ 14, గ్రీన్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు బుమ్రా, కుల్దీప్‌ ఒక్కో వికెట్‌ తీయగా.. జడేజాకు మూడు వికెట్లు దక్కాయి.

మళ్లీ దెబ్బ కొట్టిన జడేజా.. ఐదో వికెట్‌ డౌన్‌
29.4: జడ్డూ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగిన అలెక్స్‌ క్యారీ. పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరిన ఆసీస్‌ వికెట్‌ కీపర్‌. స్కోరు:119/5 (30) . మాక్సీ, గ్రీన్‌ క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
29.2: జడేజా బౌలింగ్‌లో లబుషేన్‌(27) కేఎల్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. స్కోరు: 119/4 (29.2). క్యారీ, మాక్స్‌వెల్‌ క్రీజులో ఉన్నారు.

 మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. స్మిత్‌ క్లీన్‌ బౌల్డ్‌
110 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. 46 పరుగులు చేసిన స్మిత్‌ను జడేజా క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.

26 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 104/2
26 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో మార్నష్‌ లబుషేన్‌(18), స్టీవ్‌ స్మిత్‌(44) ఉన్నారు.

సూపర్‌ కుల్దీప్‌.. డేవిడ్‌ వార్నర్‌ ఔట్‌
స్మిత్‌-వార్నర్‌ జోడీని కుల్దీప్‌ యాదవ్‌ విడగొట్టాడు. 41 పరుగులు చేసిన వార్నర్‌ను కుల్దీప్‌ అద్బుతమైన రిటర్న్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. క్రీజులోకి లబుషేన్‌ వచ్చాడు.

16 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 73/1
16 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 73 పరుగులు చేసింది. వార్నర్‌(41), స్మిత్‌(32) పరుగులతో నిలకడగా ఆడుతున్నారు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న ఆసీస్‌
వార్నర్‌ 24, స్మిత్‌ 27 పరుగులతో నిలకడగా ఆడుతున్న క్రమంలో ఆసీస్‌ 11 ఓవర్లలో అర్ధ శతకం పూర్తి చేసుకుంది. స్కోరు: 51-1
10 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 43-1

8 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 32/1
ఆదిలోని వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను డేవిడ్‌ వార్నర్‌(16), స్మిత్‌(16) అదుకున్నారు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 32 పరుగులు చేసింది. అశ్విన్‌ బౌలింగ్‌ ఎటాక్‌లోకి వచ్చాడు.

5 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 16/1
5 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్‌(11), వార్నర్‌(5) ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో విరాట్‌ కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

2 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 5/0
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్‌ వార్నర్‌(5), మిచెల్‌ మార్ష్‌ ఉన్నారు.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభం..
టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తమ బ్యాటింగ్‌ను ప్రారంభించింది. క్రీజులోకి డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ వచ్చారు. భారత బౌలింగ్‌ ఎటాక్‌ను జస్ప్రీత్‌ బుమ్రా ఆరంభించాడు.

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో ఇషాన్‌ కిషన్‌ జట్టులోకి వచ్చాడు. భారత్‌ ఇన్నింగ్స్‌ను రోహిత్‌-కిషన్‌ ప్రారంభించనున్నారు.

తుది జట్లు
భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్‌, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement