న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ ఐదు మ్యాచ్‌లాడినా... అందని విజయం ఆరో మ్యాచ్‌లో అతికష్టమ్మీద దక్కింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.
ఓపెనర్ జేసన్ రాయ్ (39 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), రసెల్ (31 బంతుల్లో 38 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) నైట్‌రైడర్స్ పరువునిలిపే స్కోరు చేశారు. అక్షర్ పటేల్ (2/13), కుల్దీప్ యాదవ్ (2/15), ఇషాంత్ శర్మ (2/19), నోర్జే (2/20) సమష్టిగా కూల్చారు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ ఆఖరి దాకా తెగ కష్టపడింది.
చివరకు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ (41 బంతుల్లో 57; 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించాడు. అక్షర్ పటేల్ (22 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్) కీలక పరుగులు చేశాడు. వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్ చెరో 2 వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: రాయ్ (సి) అమన్ హకీమ్ (బి) కుల్దీప్ 43; లిటన్‌దాస్ (సి) లలిత్ (బి) ముకేశ్ 4; వెంకటేశ్ అయ్యర్ (సి) మార్ష్ (బి) నోర్జే 0; నితీశ్ రాణా (సి) ముకేశ్ (బి) ఇషాంత్ 4; మన్‌దీప్ (బి) అక్షర్ 12; రింకూ సింగ్ (సి) లలిత్ (బి) అక్షర్ 6; నరైన్ (సి) వార్నర్ (బి) ఇషాంత్ 4; రసెల్ (నాటౌట్) 38; అనుకూల్ రాయ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 0; ఉమేశ్ (సి అండ్ బి) నోర్జే 3; వరుణ్ చక్రవర్తి (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 127. వికెట్ల పతనం: 1–15, 2–25, 3–32, 4–50, 5–64, 6–70, 7–93, 8–93, 9–96, 10–127. బౌలింగ్: ఇషాంత్ శర్మ 4–0–19–2, ముకేశ్ 4–0–34–1, నోర్జే 4–0–20–2, అక్షర్ 3–0–13–2, మిచెల్ మార్ష్ 2–0–25–0, కుల్దీప్ 3–0–15–2.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) వరుణ్ 57; పృథ్విషా (బి) వరుణ్ 13; మార్ష్ (సి) సబ్–వీస్ (బి) నితీశ్ రాణా 2; సాల్ట్ (సి అండ్ బి) అనుకూల్ 5; మనీశ్ పాండే (సి) రింకూ (బి) అనుకూల్ 21; అక్షర్ పటేల్ (నాటౌట్) 19; అమన్ హకీమ్ (బి) రాణా 0; లలిత్ యాదవ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో 6 వికెట్లకు) 128. వికెట్ల పతనం: 1–38, 2–62, 3–67, 4–93, 5–110, 6–111. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 1–0–6–0, కుల్వంత్ 1.2–0–20–0, రసెల్ 1–0–12–0, నరైన్ 4–0–36–0, వరుణ్ 4–1–16–2, అనుకూల్ 4–0–19–2, నితీశ్ రాణా 4–0–17–2.
ఐపీఎల్‌లో నేడు
చెన్నై Vs హైదరాబాద్ (రాత్రి గం. 7:30 నుంచి)
స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment