Check CSK captain’s diet plan, workout routine: పుష్కర కాలం తర్వాత భారత్ మరోసారి వన్డే ప్రపంచకప్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 2011లో సొంతగడ్డపై ఐసీసీ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఈసారి కూడా అదే ఫీట్ పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్ అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు జరుగనుంది.
ధోని మేనియా
ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానుల్లో నూతనోత్సాహం నిండింది. ముఖ్యంగా ధోని మేనియాతో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. 2011 నాటి సంగతులు గుర్తు చేసుకుంటూ రోహిత్ సేన కూడా ట్రోఫీని ముద్దాడితే చూడాలని ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు.
జట్టు గెలుస్తుందని కిచిడీ మాత్రమే తినేవాడు
ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, 2011 వరల్డ్‌కప్ విజేత వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. గౌరవ్ కపూర్ షోలో మాట్లాడుతూ.. ‘‘మేమెక్కడికి వెళ్లినా.. చాలా మంది.. ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే జట్టు గెలిచిన దాఖలాలు లేవని నిరుత్సాహపరిచేవారు. ప్రతిఒక్కరికి ఏదో ఒక మూఢనమ్మకం ఉంటుంది కదా!
అలాగే.. మహేంద్ర సింగ్ ధోని.. 2011 టోర్నమెంట్ ఆసాంతం కిచిడీ మాత్రమే తిన్నాడు. ఒకవేళ తాను రన్స్ స్కోరు చేయకపోయినా.. జట్టైనా గెలుస్తుందని నమ్మేవాడు’’ అని సెహ్వాగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా ముంబైలోని వాంఖడే వేదికగా 2011 వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా- శ్రీలంక తలపడ్డాయి.
విన్నింగ్ సిక్సర్‌తో
ఈ మ్యాచ్‌లో ధోని సిక్సర్ బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్ షాట్‌తో ఈ మిస్టర్ కూల్ కెప్టెన్ భారత్‌కు రెండో ప్రపంచకప్ అందించాడు. లంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా 1983 తర్వాత మరోసారి ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని గెలిచింది.
ధోని డైట్, జిమ్ వర్కౌట్ ఎలా ఉంటుందంటే!
టీమిండియా మాజీ సారథి ధోని ఎక్కువగా కూరగాయలు, ప్రొటిన్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు తింటాడట. అతడి రోజూవారీ డైట్‌లో పాలు, పండ్లు, బాదం ఉండాల్సిందేనట.
ఇక లంచ్‌లో ఇంట్లో చేసిన పప్పన్నం అంటే ఇష్టంగా తింటాడట. అలాగే అప్పుడప్పుడు చపాతీలు కూడా లాగించేస్తాడట. డిన్నర్‌లో మాత్రం ఫ్రూట్ సలాడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని తెలుస్తోంది.
అదే విధంగా ప్రొటిన్ షేక్స్, తాజా పండ్లరసాలు తీసుకుంటాడని అతడి సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇక ఆహార నియమాలు పాటించడంతో పాటు జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ధోని 41 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. మెషీన్ చెస్ట్ ప్రెస్, డంబెల్ చెస్ట్ ప్రెస్, సింగిల్ లెగ్ డెడ్‌లిఫ్ట్, ప్రోన్ డంబెల్ రోయింగ్ తదితర వర్కౌట్లు ధోని జిమ్ రొటిన్‌లో భాగం.
రోహిత్ భయ్యా వడాపవ్ మానేసి!
ఇక ధోని డైట్ గురించి సెహ్వాగ్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్లు టీమిండియా ప్రస్తుత సారథి రోహిత్ శర్మ పేరును లాగుతున్నారు. ధోని కిచిడీ తిని గెలిచాడట.. నువ్వు కూడా వడావపావ్ మానేసి కిచిడీ తిను భయ్యా.. కనీసం ఈసారైనా టైటిల్ గెలుస్తాం అని సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా ముంబై ఫేమస్ వడాపావ్ అంటే రోహిత్‌కు మహాప్రీతి అన్న విషంయ తెలిసిందే.
చదవండి: సత్తా చాటిన సికందర్ రజా, నికోలస్ పూరన్
2011 నుంచి ఆతిథ్య జట్టుదే.. ఈ లెక్కన వరల్డ్‌కప్ మనదేనా!
ధోని జీవితంలో తీరని విషాదం..! మిస్టర్ కూల్ నాలో ఆ అమ్మాయిని చూస్తాడనుకున్నా..
Comments
Please login to add a commentAdd a comment