India vs England, 1st Test Hyd Day 2 Score- హైదరాబాద్: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు రెండో రోజూ ఆటలోనూ టీమిండియాదే పైచేయి అయింది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా(నాటౌట్) అద్భుత అర్ధ శతకాలతో జట్టును ఆధిక్యంలో నిలిపారు. రాహుల్ 86 పరుగులు చేయగా.. శుక్రవారం నాటి ఆట ముగిసే సరికి జడ్డూ 81 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మిగతా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 80 రన్స్‌తో అదరగొట్టగా.. శ్రేయస్ అయ్యర్ 35, కోన శ్రీకర్ భరత్ 41 పరుగులతో రాణించారు. జడ్డూకు తోడుగా అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో ఆట పూర్తయ్యే సరికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. తద్వారా ఇంగ్లండ్ కంటే 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఇక ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్లేకు రెండు, జో రూట్‌కు రెండు వికెట్లు దక్కగా.. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్‌లు తలా ఓ వికెట్ తీశారు. రవిచంద్రన్ అశ్విన్ రనౌట్‌లో హార్ట్లే, వికెట్ కీపర్‌తో ఫోక్స్‌తో కలిసి భాగస్వామ్యమయ్యాడు.
Updates:
150కి పైగా పరుగుల ఆధిక్యంలో భారత్
106.2: రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన జడేజా. టీమిండియా స్కోరు 403-7(107 ఓవర్లలో). జడ్డూ 78, అక్షర్ పటేల్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఏడో వికెట్ డౌన్..
టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రవిచంద్రన్ అశ్విన్.. రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు. 94 ఓవర్లకు భారత్ స్కోర్: 367/7. క్రీజులో రవీంద్ర జడేజా(62), అక్షర్ పటేల్(4) ఉన్నారు.
ఆరో వికెట్ డౌన్..
టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 41 పరుగులు చేసిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్.. జో రూట్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. 89 ఓవర్లకు భారత్ స్కోర్: 357/6
జడేజా హాఫ్ సెంచరీ..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ సాధించాడు. 52 పరుగుల తేడాతో జడ్డూ బ్యాటింగ్ చేస్తున్నాడు. 83 ఓవర్లకు భారత్ స్కోర్: 336/5
టీ విరామ సమయానికి టీమిండియా స్కోరు: 309/5 (76)
జడేజా 45, భరత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఇంగ్లండ్ కంటే 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అధిక్యంలోకి భారత్..
70 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. క్రీజులో జడేజా(36), శ్రీకర్ భరత్(6) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగుల అధిక్యంలోకి వెళ్లింది.
ఐదో వికెట్ డౌన్.. కేఎల్ రాహుల్ ఔట్
టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 86 పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. టామ్ హార్టీలీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. రాహుల్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. క్రీజులోకి వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ వచ్చాడు. 66 ఓవర్లలో భారత్ స్కోర్: 291/5
58 ఓవర్లకు టీమిండియా స్కోర్: 254/4
58 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(79), రవీంద్ర జడేజా(7) పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ డౌన్..
223 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. రెహాన్ ఆహ్మద్ బౌలింగ్‌లో టామ్ హార్ట్‌లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రవీంద్ర జడేజా వచ్చాడు.
లంచ్ విరామానికి భారత్ స్కోర్: 222/3
రెండో రోజు లంచ్ విరామానికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(55), శ్రేయస్ అయ్యర్(29) పరుగులతో ఉన్నారు.
కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. రాహుల్ 51 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. రాహుల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్(29) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 49 ఓవర్లకు భారత్ స్కోర్: 217/3
నిలకడగా ఆడుతున్న భారత్..
గిల్ ఔటైన తర్వాత టీమిండియా నిలకడగా ఆడుతోంది. 42 ఓవర్లకు భారత స్కోర్: 191/3, క్రీజులో కేఎల్ రాహుల్(44), శ్రేయస్ అయ్యర్(14) పరుగులతో ఉన్నారు.
భారత్ మూడో వికెట్ డౌన్.. గిల్ ఔట్
టీమిండియా శుబ్‌మన్ గిల్ రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన గిల్.. హార్ట్‌లీ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌కు ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 35 ఓవర్లకు భారత్ స్కోర్: 159/3
32 ఓవర్లకు భారత్ స్కోర్: 156/2
32 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్ గిల్(23), కేఎల్ రాహుల్(23) పరుగులతో ఉన్నారు.
జైశ్వాల్ ఔట్..
రెండో రోజు ఆట ఆరంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. 80 పరుగులు చేసిన జైశ్వాల్.. రూట్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. 26 ఓవర్లకు భారత్ స్కోర్: 126/2
ప్రారంభమైన రెండో రోజు ఆట..
హైదరాబాద్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో రోజు ఆట ప్రారంభంమైంది. ఇంగ్లండ్ బౌలింగ్ ఎటాక్‌ను వెటరన్ ఆటగాడు జో రూట్ ప్రారంభించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో యశస్వీ జైశ్వాల్(76), శుబ్‌మన్ గిల్(14) పరుగులతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment