England To Tour Pakistan For 7 T20I In 2022: పాకిస్థాన్ క్రికెట్‌కు గుడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తుంది. టీ20 ప్రపంచకప్-2021 ప్రారంభానికి ముందు పాక్‌లో పర్యటించేందుకు ససేమిరా అన్న జట్లు.. ఇప్పుడు అదే దేశంలో పర్యటించేందుకు క్యూ కడుతున్నాయి. తొలుత వెస్టిండీస్ జట్టు ఈ ఏడాది చివర్లో పాక్ పర్యటనకు అంగీకారం తెలుపగా.. రెండు రోజుల కిందట ఆసీస్ జట్టు సైతం 24 ఏళ్ల తర్వాత దాయాది దేశంలో పర్యటించేందుకు ఓకే చెప్పింది.
తాజాగా వచ్చే ఏడాది(2022) సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో పాక్‌లో పర్యటించేందుకు ఇంగ్లండ్ జట్టు కూడా అంగీకారం తెలిపింది. తొలుత అనుకున్న విధంగా 5 టీ20ల సిరీస్‌కు బదులు 7 మ్యాచ్‌ల సిరీస్‌కు ఓకే చెప్పి పాక్ క్రికెట్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) సీఈఓ టామ్ హ్యారిసన్ మంగళవారం ప్రకటించారు.
వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు పాక్‌లో పర్యటించి టీ20 సిరీస్ ఆడనుంది. టీ20 ప్రపంచ కప్-2022 ముగిసిన అనంతరం ఇంగ్లండ్ మరోసారి పాక్‌కు తిరిగి వస్తుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్‌లో భాగంగా పాక్‌తో 3 టెస్ట్‌ల సిరీస్ ఆడుతుంది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021కు ముందు భద్రతా కారణాల దృష్ట్యా న్యూజిలాండ్ జట్టు పాక్ పర్యటన నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇదే కారణాలను చూపుతూ ఇంగ్లండ్ జట్టు సైతం పాక్ పర్యటనకు డుమ్మా కొట్టింది.
చదవండి: లంక ప్రీమియర్ లీగ్‌లో ఐపీఎల్ విధ్వంసకర వీరులు
Comments
Please login to add a commentAdd a comment