
రాజస్థాన్ క్రికెట్‌లో విషాదం నెలకొంది. ఆ జట్టు మాజీ క్రికెటర్ రోహిత్ శర్మ (40) కన్నుమూశాడు. గతకొంతకాలంగా లివర్ సమస్యలతో బాధపడుతున్న రోహిత్ జైపూర్‌లోని ప్రైవేటు అసుపత్రిలో నిన్న తుది శ్వాస విడిచాడు.
2014లో ప్రొఫెషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రోహిత్ ఆతర్వాత క్రికెట్ అకాడమీని స్థాపించి, కోచ్‌గా సేవలందిస్తున్నాడు. రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్, లెగ్ స్పిన్ బౌలర్ అయిన రోహిత్ 2004-2014 మధ్యలో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. రోహిత్ రాజస్థాన్ తరఫున 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 28 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టీ20లు ఆడాడు. రోహిత్ ఖాతాలో రెండు లిస్ట్-ఏ సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment