టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ఫేలవ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. కీలకమైన సౌతాఫ్రికా మ్యాచ్‌లో కూడా రాహుల్ అదే నిర్లక్ష్యం వహించాడు. కేఎల్ రాహుల్ బలహీనతను ముందే పసిగట్టిన ప్రొటిస్ బౌలర్లు అదే పనిగా ఆఫ్‌స్టంప్ మీదుగా బంతులు విసిరారు. ఈ బలహీనతే రాహుల్‌ను మరోసారి వికెట్ ఇచ్చుకునేలా చేసింది. ఎన్గిడి బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్ మీద వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుకున్నాడు. ఫలితంగా మార్క్రమ్ క్యాచ్ తీసుకోవడంతో రాహుల్ పెవిలియన్ చేరాడు.
ఇంతకముందు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లోనూ రాహుల్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. వాస్తవానికి సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్‌కు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం కేఎల్ రాహుల్‌పై నమ్మకముంచి మరొక అవకాశం ఇచ్చింది. కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో కేఎల్ రాహుల్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ''కేఎల్ రాహుల్‌కు సమయం ఆసన్నమైంది.. ఇక పక్కనబెట్టాల్సిందే'' అంటూ కామెంట్స్ చేశారు.
చదవండి: పాకిస్తాన్ బౌలర్ రాకాసి బౌన్సర్.. బద్ధలైన బ్యాటర్ ముఖం, రక్తం ధారలా..!
Comments
Please login to add a commentAdd a comment