Courtesy: IPL Twitter
ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మకు పేరుంది. కెప్టెన్‌గానే గాక బ్యాట్స్‌మన్‌గాను హిట్‌మాన్‌కు మంచి రికార్డు ఉంది. కానీ ఎందుకో రోహిత్ ఈ సీజన్‌లో యథేచ్చగా బ్యాట్‌ను ఝులుపించలేకపోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 41 పరుగులు చేసిన రోహిత్ .. ఆ తర్వాత రాజస్తాతో మ్యాచ్‌లో 10 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో అదే చెత్త ఫామ్‌ను కంటిన్యూ చేసిన రోహిత్ 12 బంతులాడి 3 పరుగులు మాత్రమే చేసి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు.
వాస్తవానికి రోహిత్ శర్మకు ఐపీఎల్‌లో కేకేఆర్‌పై మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు కేకేఆర్‌పై రోహిత్ 1,015 పరుగులు సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మన్‌కు ఏ జట్టుపై అయినా ఇదే అత్యధిక పరుగులు. మరి ఇంత మంచి రికార్డు కలిగిన హిట్‌మ్యాన్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో రాణిస్తాడనుకుంటే దారుణంగా విఫలమయ్యాడు.
దీంతో అభిమానులు రోహిత్‌పై మీమ్స్, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. ''టి20లో టెస్టు మ్యాచ్ ఆడిన ఘనత రోహిత్‌కే చెల్లుతుంది.. టీమిండియా కెప్టెన్ అయ్యాకా ఒత్తిడి పెరిగింది.. అది ఐపీఎల్‌లోనూ కంటిన్యూ చేస్తున్నావు.. ఏమైంది రోహిత్ శర్మ నీకు.. ఎందుకిలా ఆడుతున్నావు.. రన్స్ కోసం రోహిత్ తెగ కష్టపడాల్సి వస్తోంది'' అంటూ కామెంట్ చేశారు.
చదవండి: IPL 2022: రహానే నువ్వెందుకు మధ్యలో వచ్చావయ్యా!
Dewlad Brevis: అనుభవలేమి 'జూనియర్ ఏబీ' కొంపముంచింది
Rohit Sharma dismissed for just 3. Umesh Yadav the man on mission again, removes Rohit for the 5th time in the IPL.
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2022
What a test knock from Vadapav Rohit Sharma 3 (12) 😭😭😭😭 pic.twitter.com/lSK20TB0GK
— :/ (@MSDhoniwarriors) April 6, 2022
Well played Rohit sharma ❤#IPL2022 pic.twitter.com/w2nZtQqVbd
— Beef Eater Rohit (@Vadapavkhao) April 6, 2022
Comments
Please login to add a commentAdd a comment