
దేశవాళీ జాతీయ టీ20 క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. భారత యువ క్రికెటర్ తిలక్ వర్మకు తొలిసారి హైదరాబాద్ జట్టు పగ్గాలు అప్పగించారు. తిలక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఇటీవలే జరిగిన ఆసియా క్రీడల్లో తిలక్ దుమ్మురేపాడు. అంతకుముందు తను అరంగేట్రం చేసిన వెస్టిండీస్ సిరీస్‌లో తిలక్ అకట్టుకున్నాడు. ఈ క్రమంలో జట్టు కెప్టెన్సీ బాధ్యతలను తిలక్‌కు హెచ్‌సీఏ అప్పగించింది.
ఈ టోర్నీ అక్టోబర్ 16 నుంచి దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. ఈ టోర్నీలో అజింక్యా రహానే, రింకూ సింగ్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు.
హైదరాబాద్ టీ20 జట్టు: తిలక్ వర్మ (కెప్టెన్), సీవీ మిలింద్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, రాహుల్ బుద్ది, రాహుల్ రాధేశ్, రోహిత్ రాయుడు, చందన్ సహని, భవేశ్ సేథ్, రవితేజ, రక్షణ్ రెడ్డి, సంకేత్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, షౌనక్ కులకర్ణి, అమన్ రావు.
చదవండి: WC 2023: చెలరేగిన సౌతాఫ్రికా బౌలర్లు.. ఆసీస్‌కు ఘోర పరాభవం! వరుసగా రెండో ఓటమి
Comments
Please login to add a commentAdd a comment