కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉన్నతస్థాయి బృందం పాకిస్తాన్‌లో పర్యటించేందుకు మంగళవారం కరాచీ చేరుకుంది. వచ్చే ఏడాది ఇక్కడ ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యులు గల ఐసీసీ బృందం ఆతిథ్య వేదికల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, కల్పించే సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించనుంది. ఐసీసీ ఈవెంట్ల భద్రతాధికారి, జనరల్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ ఈ బృందంలో ఉన్నారు. ఈ ఏడాది పిచ్ కన్సల్టెంట్ అండీ అట్కిన్సన్ పాక్‌లో పర్యటించడం ఇది మూడోసారి.
ఈ బృందం ముందుగా కరాచీలో ఉన్న స్టేడియం, ఆటగాళ్లు బస చేసే హోటల్స్‌ను పరిశీలిస్తుంది. అనంతరం ఇస్లామాబాద్, లాహోర్‌లకు పయనమవుతుంది. భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో ఉండటంతో బృందం ప్రత్యేక దృష్టిపెట్టనుంది. ఈ బృందం నివేదిక ఆధారంగా లోటుపాట్లపై చర్చించిన తర్వాత వేదికల మార్పులు చేర్పులు, టోర్నమెంట్ తుది షెడ్యూలు ఖరారు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment