కోహ్లి- స్మిత్ (PC: Disney+Hotstar/ Twitter)
India vs Australia, 4th Test Day 3: బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌లో మూడో రోజు ఆట సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్‌కు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. కాగా సుదీర్ఘ విరామం తర్వాత ‘రన్‌మెషీన్’ కోహ్లి టెస్టుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు.
ఇదే తొలిసారి
సుమారు 14 నెలల నిరీక్షణకు తెరదించుతూ.. 15 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలిసారి 50 పరుగుల మార్కు అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 92.4వ ఓవర్లో నాథన్ లియోన్ బౌలింగ్‌లో 2 పరుగులు తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సంప్రదాయ క్రికెట్‌లో కోహ్లి కెరీర్‌లో సుదీర్ఘకాలం హాఫ్ సెంచరీ లేకుండా ఉండటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఫిఫ్టీ సాధించడంతో కింగ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోహ్లి బ్యాట్ పరిశీలించిన స్మిత్
ఇదిలా ఉంటే.. కోహ్లి 42 పరుగుల వద్ద ఉన్నపుడు డ్రింక్స్ బ్రేక్ సమయంలో సరదా ఘటన చోటుచేసుకుంది. ఆసీస్ సారథి స్మిత్ కోహ్లి బ్యాట్‌ను తీసుకుని చెక్ చేశాడు. బ్యాటింగ్ పోజులో నిలబడుతూ బ్యాట్‌ను పరిశీలించాడు. ఆ సమయంలో డ్రింక్స్ అందించే క్రమంలో అక్కడికి వచ్చిన టీమిండియా బౌలర్లు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ సహా మోకాళ్లపై కూర్చున్న కోహ్లి స్మిత్ ఏం చేస్తున్నాడా అన్నట్లు ఆసక్తిగా తిలకించారు.
ఆ తర్వాత స్మిత్ బ్యాట్ గురించి కోహ్లితో చర్చిస్తూ ఏవో సూచనలు ఇవ్వగా.. కోహ్లి నవ్వులు చిందించాడు. అనంతరం మార్నస్ లబుషేన్ కూడా వీళ్లతో జాయిన్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇద్దరు లెజెండ్స్
ఇక ఈ ఘటన నేపథ్యంలో కామెంటేటర్ దినేశ్ కార్తిక్.. ‘‘75 ఏళ్ల క్రికెట్ బంధం.. విరాట్ కోహ్లి- స్టీవ్ స్మిత్ స్నేహ బంధం.. ఇద్దరు దిగ్గజాలు’’ అని వ్యాఖ్యానించాడు. కాగా మూడో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 3 ఓవర్లలో 289 పరుగులు చేసింది. ఓపెనర్ శుబ్‌మన్ గిల్ శతకం(128)తో ఆకట్టుకోగా.. కోహ్లి హాఫ్ సెంచరీ(128 బంతుల్లో 59 నాటౌట్)తో మెరిశాడు.
చదవండి: MS Vs QTG: టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు.. ఏకంగా! రిజ్వాన్ బృందం చరిత్ర..
WPL 2023: చెలరేగిన మరిజన్, షఫాలీ.. ఢిల్లీ చేతిలో గుజరాత్ చిత్తు
Steve Smith checking the bat of Virat Kohli. pic.twitter.com/Lc6aL4lO3c
— Johns. (@CricCrazyJohns) March 11, 2023
— Anna 24GhanteChaukanna (@Anna24GhanteCh2) March 11, 2023
🏏 @imVkohli 🆚 Mitchell Starc
— BCCI (@BCCI) March 11, 2023
Quality shots on display 👌👌#TeamIndia 🇮🇳 | #INDvAUS | @mastercardindia pic.twitter.com/4J9vHV9GGm
Comments
Please login to add a commentAdd a comment